Friday, November 22, 2024

BeCare: లైట్ తీసుకుంటే, లైఫే ఉండదు.. ఒమిక్రాన్ ప్రమాదం ఉంది జగ్రత్త!

వరంగల్ (ప్రభ న్యూస్): థర్డ్ వేవ్ మొదలైంది. కరోన కేసులు పెరుగుతున్నాయి.దాంతో పాటు ఒమిక్రాన్ ప్రమాదం ముంచు కొస్తోంది. ఇంకా లైట్ తీసుకొంటే, లైఫే ఉండకుండ పోతుందని వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నన్నపనేని. నరేందర్ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలంతా కరోన కట్టడి చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడంతో పాటు , సామాజిక దూరం పాటించాలని ఎమ్మెల్యే నరేందర్ సూచించారు. కొత్తవాడలోని ఏకశిల స్కూల్ లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, దేశాయిపేట వారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన 15-, 18 సం.ల వయస్సు వారికి వ్యాక్సిన్ కోసం కోవాక్సిన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ… కరోనా మహమ్మారిని రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటుందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు ఎమ్మెల్యే నరేందర్ . కరోనా నుండి మనల్ని మనం రక్షించుకునేందుకు ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలన్నారు.మాస్కులు దరించడం, వాక్సిన్ వేసుకోవాలన్నారు. కరోన నుండి అవి మనల్ని కాపాడతాయన్నారు..15, -18 సంవత్సరాల వయసుగల వారికి వాక్సినేషన్ పక్రియ ప్రారంభమైందని సంబందిత వయసుగల వారంతా వినియోగించుకోవాలన్నారు. వాక్సినేషన్ లో తెలంగాణ ముందు వరుసలో ఉందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గుర్తుచేశారు. కార్యక్రమంలో వైద్యాదికారులు, డాక్టర్లు, ఏన్ఎం లు, ఆశ వర్కర్లు, ఇతర సిబ్బంది, ఏకశిల విద్యాసంస్థల అదినేత గౌరు తిరుపతిరెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement