ఒకప్పుడు వాళ్లిద్దరూ బాగా సన్నిహితంగా మెలిగారు. అయితే ఆమెకు మరొకరితో నిశ్చితార్థం జరిగింది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఆ యువకుడు కాస్త యువతిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. రూ.5 లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు గురి చేస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందాలపల్లికి చెందిన కే అమర్.. ఓ యువతితో పరిచయం ఏర్పర్చుకున్నాడు. ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ సమయంలో యువతికి తెలియకుండా ఫొటోలు, వీడియోలను తీసుకున్నాడు. అయితే ఇటీవలే ఆమెకు మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఇక అమర్ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
మొదటగా సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆమెకు కాబోయే భర్తకు పంపించాడు. తనకు రూ. 5 లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియోలను కూడా వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. చేసేదేమీ లేక బాధిత యువతి దమ్మపేట పోలీసులకు శుక్రవారం రాత్రి కంప్లెయింట్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. అమర్‌తో పాటు అతని స్నేహితులు ధర్మారావు, అనిల్, వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు.