Monday, November 25, 2024

కాంగ్రెస్​ కోరుకుంటే సంకీర్ణం ఏర్పాటు.. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఒక్కటి కావాలే: మమత

బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్​ మమతా బెనర్జీ 2024 ఎన్నికలపై దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ కోరుకుంటే.. సంకీర్ణం గురించి తాను మాట్లాడతానని అన్నారు. బీజేపీని ఓడించాలంటే అన్ని పార్టీలు కలిసి నడవాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీతో  పాటే మనమందరం కలిసి (2024 సార్వత్రిక ఎన్నికలు) పోరాడవచ్చు. ఈ నాలుగు రాష్ట్రాల విజయం బీజేపీకి పెద్ద విజయమేమీ కాదు అని మమత పేర్కొన్నారు.​ బీజేపీతో పోరాడాలనుకునే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక్కటిగా సాగితేనే మంచిదని, అప్పుడే తమ విశ్వసనీయతను కోల్పోవద్దని మమత స్పష్టం చేశారు.  

కాషాయ పార్టీ ఐదు రాష్ట్రాల్లో నాలుగింటిని కైవసం చేసుకున్న తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో కలిసి రావాలని తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్‌ను కోరింది. అయితే.. బీజేపీకి టీఎంసీ ఏజెంట్ గా మారిందని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలంటే టీఎంసీ అంత సీరియస్‌గా ఉండడం లేదని.. దీనికి ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తేనే మంచిదని కాంగ్రెస్‌ అధినేత్రి అధిర్‌ రంజన్‌ చౌదరి ఘాటుగా వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement