తెలంగాణ రాష్ట్ర ప్రజలను కల్వకుంట్ల కుటుంబం లూటీ చేస్తోంది. ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలని పాదయాత్ర చేస్తున్నా. ఎక్కడికి వెళ్లినా బీజీపీ, ఎక్కడికి వెళ్లినా మోడీ మోడీ అని అంటున్నారు. ఓల్డ్ సిటీలో బీజేపీ అడుగుపెడుతుందని ఎవరూ అనుకోలేదు. అక్కడి నుంచి కూడా మా పాదయాత్ర సాగింది. దానికి కార్యకర్తల ధైర్యమే నన్ను నడిపించింది అని ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇవ్వాల (శనివారం) హైదరాబాద్‌లోని తుక్కుగూడలో జరుగుతున్న బహిరంగ సభలో మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబంపై మండిపడ్డారు. తెలంగాణలో అన్ని ముఖ్య శాఖలు కల్వకుంట్ల కుటుంబంలోనే ఉన్నాయని ధ్వజమెత్తారు.
ఎక్సైజ్ శాఖ అంటే వారికి ప్రాణం.. కానీ, ఇవ్వాల నేను చెబుతున్నా కదా.. రేపటి నుంచి ఆ శాఖ కూడా వాళ్లే తీసుకుంటరు.. ఈ కేసీఆర్ పాలన పోవాలే అని అంతా అనుకుంటున్నారు. ఇచ్చిన ఏ హామీ సీఎం కేసీఆర్ నిలబెట్టుకోలేదు. పాలమూరులో తిరుగుతుంటే కండ్లల్ల నీళ్లు వచ్చినయ్. ఎక్కడబోయిన సమస్యలే, ఎక్కడపోయినా ఎడారే. ఆ పాలమూరు ప్రజల ప్రేమ, అభిమానమే వారి కొంప ముంచింది. అందుకే పాలమూరు ఎడారిగా మారింది. ఆర్డీఎస్ సమస్య తీరలే, జీవో 69 సమస్య అట్లనే ఉంది. నేను హామీ ఇచ్చి వచ్చినా, బీజేపీ అధికారంలోకి వస్తే.. ఆర్డీఎస్ సమస్య తీరుతుంది అని హామీ ఇచ్చిన.. అని బండి సంజయ్ అన్నారు.