గత ఎనిమిదేళ్లలో గుజరాత్ రాష్ట్రంలో 13 పేపర్లు లీక్ అయ్యాయని, అక్కడి ముఖ్యమంత్రి రాజీనామా చేశాడా ? అని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సోమవారం సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ… పేపర్ లీక్ కు బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాలని బండి సంజయ్ మాట్లాడుతున్నాడని, మరి గుజరాత్ రాష్ట్రంలో 13 పేపర్లు లీక్ అయితే ఎంతమంది ముఖ్యమంత్రులు రాజీనామా చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ పీఏ పేపర్ లీక్ చేశాడని ఆయన స్వగ్రామంలో వంద మందికి వంద మార్కులకు పైగా వచ్చాయని పిచ్చి కూతలు కూస్తున్నాడన్నారు. మల్యాల మండలం మొత్తంలో 35 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారని జగిత్యాల జిల్లా మొత్తంలో ఒక్కరికి మాత్రమే వంద మార్కుల కన్నా ఎక్కువ వచ్చాయని, సిరిసిల్ల జిల్లా మొత్తంలో ఒక్కరికి కూడా 100 మార్కులు రాలేదన్నారు. ఇది చాలదా పేపర్ లీకేజ్ తో తమకు సంబంధం లేదని తెలిపేందుకు అన్నారు.
గుజరాత్ లో 13పేపర్లు లీకైతే.. సీఎం రాజీనామా చేశాడా ?.. కేటీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement