Friday, November 22, 2024

ఆయిల్ పామ్ సాగులో ఆద‌ర్శం.. గ‌ద్వాల జిల్లాలో 1500 ఎక‌రాల్లో పంట‌

ఇటిక్యాల (ప్రభ న్యూస్‌) : గద్వాల జిల్లాలో 1500 ఎకరాల్లో ఆయిల్‌ ఫామ్‌ సాగు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు1,426 ఎకరాలకు ఆమోదం ఇచ్చారు. అందులో 823 ఎకరాలకు రైతులు తమ పొలాల్లో మొక్కలు నాటుకోవడం జరిగిందని ఉద్యానవన శాఖ అధికారి సురేష్‌ తెలిపారు. గురువారం బీచుపల్లి నర్సరీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లాలోని బీచుపల్లిలోగల టీఎస్‌ ఆయిల్‌ ఫెడ్‌ వారి నర్సరీ నుండి సుమారు 30ఎకరాల వరకు ఆయిల్‌ ఫామ్‌ మొక్కలను ఆమోదం చేసి జిల్లా రైతులకు సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ అధికారి తనిఖీచేసి రైతులకు నాణ్యమైన మొక్కలు అందించాలని ఆయిల్ పామ్‌ నర్సరీ మేనేజర్‌ సుమంత్‌ను అదేశిచారు.

ఇప్పటికే మొక్కలకు రైతువాటా చెల్లించిన రైతులకు జిల్లా కలెక్టర్‌ ఆమోదంతో మొక్కలు సరఫరా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మిగిలిన 603 ఎకరాలకు రైతులు త్వరితగతిన గుంతలు తయారు చేసుకొని ఈనెల చివరినాటికి మొక్కలు తీసుకొని నాటుకోవాలని సూచించారు. ఫిబ్రవరి నెలలో ఉష్ణోగ్రతలు పెరిగి మొక్కలు నాటుటలో ఇబ్బందులు ఏర్పడుతున్నందున రైతులు వెంటనే మొక్కలు తీసుకొని నాటుకోవాలని తెలిపారు. మొక్కలు తీసుకోవడానికి రైతుల ప్రతినిధులు కాకుండా సాగుదారులే స్వయంగా వచ్చి మొక్కలు తీసుకోవాలని, రైతులు స్వయంగా వస్తే వారికి మొక్కలు పెంచడంలో శిక్షణ, అవగాహన కల్పించడం జరుగుతుందని ఉద్యాన శాఖ అధికారి సురేష్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సరీ మేనేజర్‌ సుమంత్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement