Friday, November 22, 2024

ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు

దేశంలో కరోనా ఉగ్ర రూపం దాల్చడంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి. మరికొన్ని వాయిదా వేశాయి. తాజాగా కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్స్‌ (ఐసీఎస్ఈ) కీలన నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 12వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌ల‌ను మాత్రం ఆఫ్‌లైన్‌లో నిర్వ‌హించ‌నున్నారు. అయితే ఆ ప‌రీక్ష‌ల తేదీల‌ను త‌ర్వాత ప్ర‌క‌టిస్తారు. జూన్‌లో నిర్వ‌హించే స‌మీక్ష త‌ర్వాత ఈ నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఏప్రిల్ 16వ తేదీన జారీ చేసిన స‌ర్క్యూల‌ర్‌ను ఉప‌సంహ‌రిస్తున్న‌ట్లు బోర్డు పేర్కొన్న‌ది. విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ ఆరోగ్యం కీల‌క‌మైంద‌ని, అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఐసీఎస్ఈ చెప్పింది.

కాగా, కరోనావైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement