Monday, November 25, 2024

కేదార్ నాథ్ లో మంచుతుఫాన్.. ఆరెంజ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించిన అధికారులు

ఎడ‌తెరిపిలేని హిమ‌పాతం కురుస్తోంది కేదార్ నాథ్ లో. దాంతో అధికారులు ఆరెంజ్ అల‌ర్ట్ ని ప్ర‌క‌టించారు. రిషికేష్‌లో యాత్రికుల రిజిస్ట్రేషన్‌ ను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులను బట్టి యాత్ర కొనసాగుతుందని తెలిపారు. గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరో రెండు మూడు రోజులపాటు హిమపాతం కొనసాగే అవకాశం ఉందని రుద్రప్రయాగ్ కలెక్టర్ తెలిపారు. ఆలయ పరిసరాల్లో అడుగుతీసి అడుగు వేసే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. యాత్రికులు తమ బస ప్రాంతానికే పరిమితమయ్యారు. హిమపాతం కారణంగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయని అధికారులు చెప్పారు. దీంతో వయసు పైబడిన యాత్రికులు కొందరు ఊపిరి అందక ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్‌నాథ్‌ యాత్రను ఇప్పటికే నిలిపివేశారు. కేదార్ నాథ్ లో చిక్కుకున్న యాత్రికులను గుర్రాలపై కిందికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాత్రలో దాదాపు 150 మంది తెలుగువారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement