అంతర్జాతీయ పురుషుల టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి చేరాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు, మూడో టీ20ల్లో అద్భుతంగా ఆడిన కోహ్లీ.. ఒక ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ (31), రిషబ్ పంత్(80) ర్యాంకులు సహా ఆల్‌రౌండర్ల విభాగంలో వాషింగ్టన్ సుందర్(11), బౌలర్లలో శార్దూల్(27), భువనేశ్వర్(45) మెరుగైన స్థానాల్లో నిలిచారు. మరోవైపు టెస్టులు, వన్డేలు, టీ20లు కలుపుకుని మూడు ఫార్మాట్లలో టాప్-5 ర్యాంకుల్లో ఉన్న ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు.
అటు కేఎల్ రాహుల్ ఆటతీరుపై విమర్శల నేపథ్యంలో కోహ్లీ స్పందించాడు. రాహుల్ ఛాంపియన్ ప్లేయర్ అని, బౌన్స్ బ్యాక్ అయ్యే సత్తా అతడిలో ఉందని కోహ్లీ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల నైపుణ్యం రాహుల్‌లో ఉందన్నాడు. రోహిత్‌తో పాటు అతడు కూడా భారత్ ప్రధాన బ్యాటింగ్ లైనప్‌లో కీలకం అంటూ రాహుల్‌కు కోహ్లీ మద్దతుగా నిలిచాడు.