తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం స్పీడప్ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులను ఎన్నికల విధుల్లోకి తీసుకున్నట్టు తెలిపింది. జీహెచ్ఎంసీ కమిషనర్ లోక్ష్ కుమార్‌ను అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా, ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ను సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించింది.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వాల (బుధవారం) ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల అధికారుల బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సీఎస్, డీజీపీ, ఆదాయపు పన్నుల శాఖ, ఇతరశాఖలతో వరుస సమీక్షలు నిర్వహించింది. ఎన్నికల ఏర్పాట్లపై పలు సూచనలు చేసింది.