Thursday, November 21, 2024

జైసల్మేర్​ కలెక్టర్​గా టీనా దాబి.. ఇన్​స్టాలో ఫస్ట్​ డే డ్యూటీ ఫొటోలు షేర్​!

ఈ మధ్యకాలంలో రెండో పెళ్లి చేసుకున్న ఐఏఎస్​ ఆఫీసర్​ టీనాదాబి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. తన మొదటి భర్త ఐఏఎస్​ అధికారి అథర్​ఖాన్​తో 2018లో వివాహమైంది. వారిద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో 2020లో విడాకులకు అప్లయ్​ చేసుకున్నారు. ఆ తర్వాత మరో ఐఏఎస్​ అధికారి ప్రదీప్​ గవాండేని టీనా ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నారు. జైపూర్​లో జరిగిన ఈ పెళ్లి వేడుకల ఫొటోలు ఈ మధ్య హల్​చల్​ అయ్యాయి. కాగా, ఆమె ఇవ్వాల జైసల్మేర్​ కలెక్టర్​గా బాధ్యతలు తీసుకున్న ఫొటోలను ఇన్​స్టాలో షేర్​ చేసి తన హ్యాపీనెస్​ని అందరితో పంచుకున్నారు.

రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లా 65వ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి టీనా దాబీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తన తొలిరోజు డ్యూటీకి సంబంధించిన ఫొటోలను టీనా సోషల్ మీడియాలో షేర్ చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షలో టాప్​లో నిలిచిన మొదటి SCమహిళగా గుర్తింపు పొందారు. అయితే.. టీనా దాబీ జైసల్మేర్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వాటిని చాలామంది షేర్​ చేస్తూ.. గ్రేట్​ అంటూ కామెంట్స్​ కూడా చేస్తున్నారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో కాశ్మీర్‌లో ఉన్న 2015-బ్యాచ్ IAS అధికారి డాక్టర్ అథర్ అమీర్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత దాబీ 2013-బ్యాచ్ IAS అధికారి డాక్టర్ ప్రదీప్ గవాండేని జైపూర్‌లోని ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఏప్రిల్ 22న జైపూర్‌లోని ఓ ఖరీదైన హోటల్‌లో దాబీ, గవాండేల వివాహ రిసెప్షన్‌ జరిగింది.

దాబీ, గవాండే ఇద్దరూ జైపూర్‌లోనే ఉద్యోగంలో నియమితులయ్యారు. టీనా రాజస్థాన్ ప్రభుత్వ ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తుండగా, ప్రదీప్ జైపూర్‌లోని ఆర్కియాలజీ, మ్యూజియంల డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గవాండేకి ఇది అతని మొదటి వివాహం కాగా, దాబీ రెండోసారి వివాహం చేసుకున్నారు.

దాబీకి ఇంతకుముందు అథర్ అమీర్ ఖాన్‌తో వివాహం జరిగింది. కానీ, వారి వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. దాబీ, ఖాన్‌లకు జైపూర్ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. 2015 UPSC పరీక్షలో టాపర్ అయిన దాబీ, ఆమె మాజీ భర్త ఖాన్ 2020వ సంవత్సరం నవంబర్ లో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాబీ మరియు ఖాన్ 2018లో వివాహం చేసుకున్నారు. 2015లో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో అథర్ ఖాన్ రెండవ స్థానం సాధించారు. అదే సంవత్సరం టీనా దాబీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement