డిప్యూటీ కలెక్టర్లకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ హోదా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 2019, 2020, 2021 ప్యానల్ సంవత్సరాలకు చెందిన నిర్మలా కాంతి వెస్లీ, కోట శ్రీవత్స, చంద్రశేఖర్, ప్రియాంక, అరుణశ్రీ ఈ జాబితాలో ఉన్నారు. ఇక నిర్మలా కాంతి వెస్లీ ఫైలు ఏడాదిన్న కాలంగా సచివాలయంలో పెండింగ్లో ఉంది… తాజాగా ఆ ఫైలు కదిలింది. ఫైలు ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖలో ఉంది.
త్వరలోనే doptకి ఈ ఫైలు వెళ్లనుంది. ఇందులో ఇద్దరు కోట శ్రీవత్స దివంగత ips ks వ్యాస్ కుమారుడు కాగా, నిర్మలా కాంతి వెస్లీ ys రాజశేఖర్ రెడ్డితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన dsp వెస్లీ భార్య. ఇక ఈ జాబితా ఆమోదం అనంతరం తదుపరి జాబితాలో ప్రమోటీ డిప్యూటీ కలెక్టర్లు ias హోదా కోసం వెళ్లనున్నారు. ఐదుగురు కూడా state civil service కోటాలో confird ias కానుండగా కారుణ్య నియామకాలు, group-1ద్వారా డిప్యూటీ కలెక్టర్ లుగా అయిన వారే.