Tuesday, November 19, 2024

Controversy | ఆర్​ఎస్​ఎస్​ ప్రోగ్రామ్​లో ఐఏఎస్​ అధికారులు.. తప్పుపడుతున్న కాంగ్రెస్​ నేతలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సాత్నా జిల్లాలో జూన్ 11వ తేదీన జరిగిన “సమర్పన్ సమరోహ్” అనే ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అనురాగ్ వర్మ, మునిసిపల్ కమిషనర్ రాజేష్ షాహి హాజరయ్యారు. వారి ఫొటోలను చూపిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉన్నతాధికారులు ఇలా దొరికిపోవడాన్ని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ ఫొటోలో అధికారులు ఆర్​ఎస్​ఎస్​ కార్యక్రమానికి హాజరవమే కాకుండా, హిందూత్వ సంస్థ యొక్క సంప్రదాయ వందనం “ధ్వజ్ ప్రాణం” చేయడానికి చేతులు పైకెత్తడం కూడా కనిపిస్తోంది.

కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంఖా ఈ ఫొటోని ట్వీట్ చేసి ఆందోళనను వ్యక్తం చేశారు. “కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ RSS కార్యక్రమంలో పాల్గొని, వారి జెండాకు వందనం చేస్తున్న ఫొటో ఇది. ఇలాంటి సంబంధాలతో ఉన్న ప్రభుత్వ అధికారులు న్యాయమైన ఎన్నికలను ఎలా నిర్వహించగలరు? వీరిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్బాల్ సింగ్ బైన్స్ ను టంఖా కోరారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ని ట్యాగ్ చేసి ఎన్నికల ప్రక్రియ నుంచి వారిని తొలగించాలని డిమాండ్ చేశారు.

కాగా, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రశాంత్ సింగ్‌తో పాటు తాను ఈ కార్యక్రమానికి హాజరయ్యానని కలెక్టర్​ అనురాగ్ వర్మ తెలిపారు. ఈ ఫంక్షన్‌లో పాల్గొనడాన్ని సమర్థించుకున్నారు వర్మ. ఫంక్షన్‌కి హాజరు కావడంలో ఎలాంటి తప్పు లేదని, 8,000 మందికి పైగా పాల్గొన్న పబ్లిక్ ఈవెంట్ గా ఆయన తెలిపారు..

- Advertisement -

ఇక.. మరో అధికారి రాజేశ్​ షాహి మాట్లాడుతూ.. మేము ఏదైనా నిర్దిష్ట భావజాలానికి చెందినవారమని, లేదా మద్దతు ఇస్తున్నామని ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల తెలియదు. మేము రెండు వారాల క్రితం నిరంకారి సంఘం కార్యక్రమానికి హాజరయ్యాము. అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా పాల్గొనడానికి చేతులు ముడుచుకుని నిల్చున్నాము. దీనివల్ల మనం వారి భావజాలాన్ని ప్రచారం చేయడం లేదు. మేము ప్రభుత్వం కోసం పని చేస్తాము. కొన్నిసార్లు ఇతర వ్యక్తులతో సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతాము. అని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement