ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) వెల్లడించింది. గగనతలం తెరిస్తే, భారత ప్రభుత్వం అప్పగించిన ఏ పనినైనా చేపడుతామని IAF తెలిపింది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్లోని విద్యార్థులతో సహా దాదాపు 18,000 మంది భారతీయులను వెనక్కి తీసుకురావడానికి MEA చర్యలు తీసుకుంటోందని, ఉక్రెయిన్లోని గగనతలం మూసివేయబడినందున, భారతీయ పౌరుల తరలింపు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తెలిపారు. భారతీయులందరికీ కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని ఆయన వెల్లడించారు.
మేం రెడీగా ఉన్నాం.. ఉక్రెయిన్లోని భారతీయులను తీసుకొస్తాం: ఇండియన్ ఎయిర్ ఫోర్స్
Advertisement
తాజా వార్తలు
Advertisement