రాష్ట్రీయ జనతాదళ్ (RJD) చీఫ్ లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను త్వరలోనే ఆర్జేడీకి రాజీనామా చేస్తానని తేజ్ ప్రతాప్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘’ఆర్జేడీలో నేను మా నాన్న అడుగుజాడల్లో నడిచాను. పార్టీలో అందరికీ గౌరవం ఇచ్చాను. త్వరలోనే మా నాన్నను కలిసి రాజీనామా లేఖను సమర్పిస్తాను’’ అని తేజ్ ప్రతాప్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఏప్రిల్ 22న జరిగిన పార్టీ ఇన్‌ఫ్తార్ పార్టీలో తేజ్ ప్రతాప్ తనను కొట్టారని RJD యువజన విభాగం నాయకుడు రామ్‌రాజ్ యాదవ్ ఆరోపించారు. ఈ క్రమంలో తేజ్ ప్రతాప్ రాజీనామా చేస్తానంటూ చేసిన ట్వీట్ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఆయన కేవలం పార్టీ సభ్యత్వానికే రాజీనామా చేస్తారా? లేక ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా? అన్న విషయంపై స్పష్టత లేదు.