Friday, November 22, 2024

TS | నేను బతికి ఉండగా ఆ పని చేయనివ్వను.. మెద‌క్ జిల్లాలో ప్రధాని మోదీ

రాజ్యాంగం ఓ పవిత్ర గ్రంధమనీ, కాంగ్రెస్ దాన్ని కించపరుస్తుందని ప్ర‌ధాని మోదీ అన్నారు. మెద‌క్ జిల్లా అల్లాదుర్గంలో ఈరోజు (మంగ‌ళ‌వారం) సాయంత్రం జ‌రిగిన బహిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. రాజ్యాంగంపై, పార్లమెంట్‌పై త‌న‌కు ఎంతో గౌరవం ఉందని అన్నారు. అలాగే.. నూతనంగా నిర్మించిన పార్లమెంట్‌లో రాజ్యాంగాన్ని ఉంచాననీ, ప్రవిత గ్రంథాలైన భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా రాజ్యాంగాన్ని గౌర‌విస్తాం అన్నారు.

రాజ వంశీయులు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారనీ, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని విస్మరించిందనీ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో మొదట సవరణలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి, నెహ్రు కుటుంబానికి దక్కుతుందని ప్ర‌ధాని అన్నారు. రాజవంశీలు ఈ దేశాన్ని పరిపాలించడం తమ జన్మహక్కుగా భావిస్తున్నారనీ, ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తున్నారని మండిప‌డ్డారు.

కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోచుకుంటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందనీ, ఆ పార్టీ దేశ ప్రజలపై వారసత్వ పన్ను విధించాలని చూస్తుందని ప్రధాని మోదీ విమర్శించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసును బీఆర్ఎస్ ప్రభుత్వం కనుమరుగు చేసిందని, బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం అవినీతి కేసును కాంగ్రెస్ పార్టీ అణిచివేసిందనీ, ఇరు పార్టీలు పరస్పరం సహరించుకుంటున్నాయని విమర్శలు గుప్పించారు.

- Advertisement -

మోదీ జీవించినంత కాలం రాజ్యాంగాన్ని కదిలిచే శక్తి ఎవరికి లేదనీ, తాను బతికి ఉన్న కాలం దళిత, ఆదివాసులు, బీసీల హక్కుల రక్షణ కోసం పాటు పడుతానని అన్నారు. తాను మూడో సారి ప్రధాని అయినా తరువాత.. ఘనంగా రాజ్యాంగ 75 వారికోత్సవం ఘనంగా నిర్వహిస్తాననీ, ఆ మహా వేడుకలో ప్రజల అందర్ని భాగస్వామ్యం చేస్తామని అన్నారు. అలాగే.. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ఎలా తూటు పోడిచిందో బహిరంగపరుస్తామని అన్నారు.

తెలంగాణకు నాలుగు వందేభార‌త్‌ ఎక్స్ ప్రెస్ రైళ్ల‌తో పాటు 40 రైల్వే స్టేషన్ల‌ను కూడా ఏర్పాటు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుంద‌ని మోదీ అన్నారు. పలు హైవేలను అభివ్రుద్ది పరుస్తున్నామని అన్నారు. తెలంగాణ అభివ్రుద్దికి బీజేపీ పెద్దపీట వేసిందనీ, సిద్దిపేట, సిరిసిల్లా, కొత్తపేట రైల్వే స్టేషన్ మంజూర్ చేస్తే.. కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీ అడ్డంగులు స్రుష్టించాయన్నారు. ఆ పార్టీలు ఓట్ల కోసం విక్రుత చేష్టలు చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. తెలంగాణ ప్రగతి బాటలో నడిపించే సత్తా బీజేపీకే ఉందన్నారు. ఈ సారి ఇండియా కూటమికి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదనీ, బీజేపీ అభ్యర్థులకు వేసే ఓటు డైరెక్ట్ గా తనకు వేసినట్టు అవుతుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement