తన మాజీ భార్య మెలిండాని మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మైక్రోసాప్ట్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు ..ప్రముఖ బిలియనీర్ బిల్ గేట్స్ అన్నారు..తన మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ గురించి మాట్లాడారు. ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ వివాహం చాలా అద్భుతంగా జరిగిందని చెప్పారు. ఓ మీడియా సంస్థకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మెలిండాను తాను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. గత రెండు సంవత్సరాలను చాలా నాటకీయంగా అభివర్ణించారు.కోవిడ్ మహమ్మారి, విడాకులు .. పిల్లలను విడిచిపెట్టడం జీవితంలో విచిత్రమైన పరిస్థితిని చెప్పారు. బిల్ గేట్స్, మెలిండా గేట్స్ 1994 లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు (జెన్నర్, రోరీ , ఫోబ్) ఉన్నారు. దాదాపు 27 సంవత్సరాల వైవాహిక జీవితం తరువత వారు 2021 మేలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే వీరి విడాకులు 2021 ఆగస్టులో అధికారికంగా ఖరారు అయ్యాయి. అయితే వీరు నిర్వహిస్తున్న బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను కలిసి కొనసాగిస్తామని ప్రకటించారు. మీకు తెలుసా.. నేను మరెవరినీ పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నానని చెప్పారు. మెలిండా ఫ్రెంచ్ గేట్స్‌ని మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని అడిగినప్పుడు దానికి ఆయన అవును అని సమాధానం ఇచ్చారు. అవును. నేను మెలిండాను మళ్ళీ వివాహం చేసుకుంటానన్నారు.. బిల్ గేట్స్ తన మాజీ భార్యతో ఇప్పటికీ స్నేహంగానే ఉన్నానని తెలిపారు. అందుకే ఇద్దరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement