శివసేన నేత యశ్వంత్ జాదవ్‌కు సంబంధించిన ఆస్తులపై జరిపిన దాడుల్లో సుమారు రూ.130 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన రుజువు లభించినట్లు ఆదాయపు పన్ను శాఖ ఈ రోజు (గురువారం) వెల్లడించింది. ఇందులో జాదవ్, అతని కుటుంబం లేదా వారి సహచరులు.. బినామీదార్లు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి. గత వారం జరిపిన దాడుల్లో అంతర్జాతీయ హవాలా లావాదేవీల్లో వారి ప్రమేయం, అక్రమంగా సంపాదించిన డబ్బును కొన్ని విదేశీ అధికార పరిధికి మళ్లించడం వంటి ఆధారాలను కూడా IT డిపార్ట్ మెంట్ కనుగొంది.
బిర్హాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కాంట్రాక్టర్లకు, యశ్వంత్ జాదవ్‌కు మధ్య సాన్నిహిత్యానికి సంబంధించిన ఆధారాలు కూడా లభించాయని ఐటీ శాఖ తెలిపింది. జాదవ్, అతని సహచరుల ప్రాంగణంలో జరిపిన సోదాల్లో అనేక కోట్లకు పైగా లెక్కలోకి రాని నగదు రసీదులు, చెల్లింపుల వివరాలతో కూడిన లూజ్ షీట్లు, ఎక్సెల్ ఫైల్లు కూడా లభించాయని, వాటన్నిటినీ స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ వర్గాలు తెలిపాయి. ఈ చెల్లింపులు సాధారణ ఖాతా పుస్తకాలలో నమోదు చేయలేదని అధికారులు వెల్లడించారు.
జాదవ్ BMC స్టాండింగ్ కమిటీ చైర్మన్ కాగా, అతని భార్య బైకుల్లా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు యశ్వంత్ జాదవ్, వారి సన్నిహితులు BMCలో అవినీతి, కార్టలైజేషన్‌కు పాల్పడినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో ఐటీ శాఖ గత వారం మూడు రోజులుగా ముంబై అంతటా సోదాలు, స్వాధీనం వంటి కార్యకలాపాలు నిర్వహించింది. మొత్తం మీద సెర్చ్ ఆపరేషన్ సమయంలో ముంబైలోని 35కి పైగా ప్రాంగణాలను కవర్ చేశారు. బిమల్ అగర్వాల్, మదానీ, బిపిన్ జైన్, ల్యాండ్‌మార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి బీఎమ్సీ కాంట్రాక్టర్లపై దాడులు జరిగాయి. వారి స్థలాలను కూడా సోదా చేశారు. అగర్వాల్‌ను గతంలో బెట్టింగ్-సంబంధిత కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అంతేకాకుండా ముంబై పోలీసులకు లో క్వాలిటీ బాంబ్ సూట్లను సరఫరా చేసిన విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
కాంట్రాక్టర్ల విషయానికొస్తే స్వాధీనం చేసుకున్న పత్రాలు పన్ను పరిధిలోకి వచ్చేలా.. ఆదాయాన్ని పెద్ద ఎత్తున చూపించేందుకు.. వారి ఖర్చులను పెంచడానికి అనుసరించిన కార్యాచరణను వెల్లడిస్తున్నాయి. ఈ ప్రయోజనం కోసం ప్రముఖమైన ఆశ్రయం ఏమిటంటే ఎంటిటీల మేజ్ ద్వారా, అసలైన ఖర్చులను క్లెయిమ్ చేయడం ద్వారా సబ్-కాంట్రాక్ట్ ఖర్చులను అధికంగా ఇన్వాయిస్ చేయడం వంటివి ఉన్నాయి. ఈ సంస్థల నుండి నగదు తీసుకున్నట్టు, కాంట్రాక్టుల ప్రదానానికి, ఆస్తులలో పెట్టుబడులకు లెక్కకు మిక్కిలి చెల్లింపులు చేయడానికి అనవసరమైన సహాయాలు పొందేందుకు ఉపయోగించినట్లు కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నాయి. పై అవకతవకల కారణంగా ఈ కాంట్రాక్టర్లు రూ.200 కోట్ల మేర ఆదాయాన్ని ఎగవేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మూడు రోజుల పాటు సెర్చ్, సీజ్ ఆపరేషన్ కొనసాగింది. మొత్తం 35 స్థలాలను శోధించారు. సోదాల్లో ఇప్పటి వరకు రూ.2 కోట్ల నగదు, రూ.1.5 కోట్ల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతున్నట్టు ఐటీ వర్గాలు తెలిపాయి.