– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
గుండెపోటు అనేది మగాళ్ల మాదిరిగా ఆడాళ్లలో కనిపించదు. మగవారిని ప్రభావితం చేసే సాధారణ గుండెపోటు లక్షణాల్లో ఒక చేయి కిందకి వచ్చి ఛాతీలో నొప్పిని నలిపివేయడం వంటిది చూడొచ్చు. కానీ, ఆడాళ్లలో ఈ లక్షణాలు కనిపించవు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మహిళల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం ఈ-సిగరెట్లు, ఐపిల్స్ వాడకంతో ముడిపడి ఉంటుంది. హైదరాబాద్‌లోని గమన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్పెషలిస్ట్ డాక్టర్ నందకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. చాలా ఇంట్రెస్టింగ్ కలిగించే అంశాలు యువతీ, యువకులు తెలుసుకోవాల్సి ఉంది.
“ఐ-పిల్స్, ఈ -సిగరెట్లు యువతులలో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ-సిగరెట్ వాడకం కూడా యువతీ, యువకులతో పాటు మగాళ్లు, ఆడాళ్లలో చాలా ఎక్కువగా ఉంది. నికోటిన్ వాడకం మహిళల్లో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కానీ, ఇది కాకుండా అత్యవసర గర్భనిరోధక మాత్రలు అని పిలిచే ఐ-పిల్స్ కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచే లెవోనార్జెస్ట్రెల్ యొక్క అధిక మోతాదును కలిగి ఉంటాయి. ఇది 70-90 శాతం సామర్థ్యంతో అసురక్షిత సంభోగం యొక్క 72 గంటలలోపు ఉపయోగించినప్పుడు అవాంఛిత గర్భధారణను నివారించడానికి ఉపయోగించబడుతుంది. ఈ పిల్ వాడడం ద్వారా వికారం, వాంతులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి”అని వివరించారు.
ఇక.. “ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్-కలిగిన ఐపిల్స్ (నోటి ద్వారా తీసుకునే ట్యాబ్లెట్స్)ని గర్భనిరోధక పద్ధతిగా.. రుతు చక్రం నియంత్రించడానికి ఉపయోగిస్తారు. నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలలోని ఈస్ట్రోజెన్‌లు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి థ్రోంబోటిక్ వ్యక్తీకరణలకు కారణమవుతాయి” అని డాక్టర్ నందకిషోర్ తెలిపారు. అంతేకాకుండా ఊబకాయం, మధుమేహం, రక్తపోటు ఉన్న రోగులలో.. థ్రాంబోసిస్, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నవారిలో.. 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మహిళలు గుండెపోటు లక్షణాలతో బాధపడవచ్చు.. కానీ, చాలామంది తరచుగా మబ్బుగా లేదా మైల్డ్‌గా ఉంటారు. వారిలో హార్ట్ ఎటాక్‌కి బయటికి కనిపించని లక్షణాలు ఇవేనని తెలిపారు.
డాక్టర్ నందకిషోర్ చెప్పిన వివరాల ప్రకారం.. సాధారణ సిగరెట్‌తో పోల్చినప్పుడు ఈ సిగరెట్లో నికోటిన్ పరిమాణం అంతగా లేనప్పటికీ.. అది నికోటిన్ వంటిదే కావడం గమనించాలి. మానవ శరీరానికి హాని కలిగించే అనేక విషపూరిత పదార్థాలను ఈ సిగరెట్ కలిగి ఉన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. సిగరెట్ల బారి నుంచి తప్పించుకోవాలి అనుకునే వారు ఈ సిగరెట్స్‌ని ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత వీటి అలవాటును వదిలివేయడం చాలా కష్టం. ఈ-సిగరెట్ యొక్క అనారోగ్య స్వభావం గురించి యువతకు ఇప్పటికీ తెలియదు.
ఈ-సిగరెట్లు అంత విషపూరితం కాదని, వారి ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు కలిగించదని చాలామంది భావిస్తున్నారు. ఈ-సిగరెట్‌ల ప్రభావం.. వ్యసన స్వభావం గురించి యువత తప్పనిసరిగా తెలసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక.. చాలామంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఐపిల్స్ తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి వారు మందులు వాడాల్సి ఉంటుంది.
గుండెపోటు రావడానికి నాలుగు సైలెంట్ రీజన్స్..
• ఛాతీలో నొప్పి, ఒత్తిడి, అసౌకర్యం.
• వివిధ శరీర భాగాలలో అసౌకర్యం.
• శ్వాస సమస్యలు.. తేలికపాటి తలనొప్పి.
• చల్లని చెమటలు.. వికారం వంటివి