Friday, November 22, 2024

నా భార్యను బుజ్జగించేందుకు లీవ్‌ కావాలి… ఏఎస్పీకి కానిస్టేబుల్‌ లేఖ

అలిగిన తన భార్యను బుజ్జగించేందుకు లీవ్‌ కావాలని కోరుతూ ఓ కానిస్టేబుల్‌ ఏఎస్పీకి లేఖ రాసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. గౌరవ్‌ చౌధరి అనే కానిస్టేబుల్‌కు గత డిసెంబరులో వివాహమైంది. ఆ వెంటనే భార్యను ఇంటి వద్ద వదిలి విధుల కోసం తాను పనిచేస్తున్న చోటికి వచ్చాడు. అప్పట్నుంచి మళ్లీ ఇంటికి వెళ్లలేదు. దీంతో అతడి భార్య అలిగిందట.

”పెళ్లైన వెంటనే నా భార్యను వదిలి వచ్చినందుకు ఆమె నాపై అలిగింది. నేను ఫోన్‌ చేసినా స్పందించడం లేదు. నా కాల్‌ను కట్‌ చేస్తోంది. కొన్నిసార్లు ఫోన్‌ ఎత్తినా మాట్లాడమని ఆమె తల్లికి ఇస్తోంది. వెంటనే ఇంటికి వెళ్లి నా భార్యను బుజ్జగించేందుకు నాకు వారం రోజులు సెలవులు కావాలి” అని గౌరవ్‌ లేఖలో అభ్యర్థించాడు. ప్రస్తుతం ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గౌరవ్‌ బాధను అర్థం చేసుకొన్న ఏఎస్పీ అతడికి అయిదు రోజులపాటు సెలవులు మంజూరు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement