వాళ్లిద్దరూ నాకిష్టమే.. అందుకే నా గర్ల్‌ఫ్రెండ్స్ ఇద్దరికీ ఒకే వేదికపై తాళి కట్టేశాను అని జార్ఖండ్ వాసి తెలిపాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చట్ట ప్రకారం ఇద్దరు మహిళలను పెండ్లి చేసుకోవడం తప్పే అయినా తాను వారిద్దరినీ విడిచి ఉండలేనని చెప్పుకొచ్చాడు. లోహర్దగ గ్రామంలోని కుసుం లక్రా, స్వాతి కుమారి అనే ఇద్దరు యువతులను సందీప్ ఓరాన్‌ను ప్రేమించారు.
ఇక.. అతడిని వదులుకోలేక గ్రామంలోని ఒకే మండపంలో సందీప్‌ను ఇద్దరూ పెళ్లాడారు. మూడేండ్లుగా సందీప్, కుసుం సన్నిహితంగా ఉంటున్నారు. వారిద్దరూ ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చారు. ఈ క్రమంలో సందీప్ ఇటుక బట్టీలో పనిచేసేందుకు బెంగాల్‌కు వెళ్లగా అదే బట్టీలో పనిచేసే స్వాతి కుమారికి దగ్గరయ్యాడు.
వారు తమ గ్రామాలకు తిరిగి వచ్చిన తర్వాత కూడా తరచూ కలుసుకునే వారు. ఇరు కుటుంబాల్లో వారి సంబంధంపై గొడవలు చెలరేగగా విషయం పంచాయితీకి చేరింది. సందీప్ ఇద్దరు మహిళలను పెండ్లి చేసుకోవాలని గ్రామ పెద్దలు తీర్మానించడంతో మహిళలు ఇద్దరూ ఇష్టపడటంతో ముగ్గురు వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు.