హైదరాబాద్ చరిత్రలో సుప్రసిద్ధ నగరమని, హైదరాబాద్ ను పవర్ ఐల్యాండ్ గా మార్చానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. మెట్రో సెకండ్ ఫేజ్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా పోలీసు అకాడమీ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ఢిల్లీ కంటే జనాభాలో, వైశాల్యంలో ఒకప్పుడు హైదరాబాద్ పెద్ద నగరమన్నారు. 1912లో విద్యుత్ వచ్చిన నగరం హైదరాబాద్ అన్నారు. అత్యంత సురక్షితమైన నగరం హైదరాబాద్ అన్నారు.
సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో హైదరాబాద్ సమగ్రత లేకుండా పోయిందన్నారు. న్యూయార్క్, లండన్, ప్యారిస్ లో అయినా కరెంట్ పోవచ్చని.. హైదరాబాద్ లో మాత్రం కరెంట్ పోయే అవకాశమే లేదన్నారు. అన్ని గ్రిడ్ లతో అనుసంధానించి పరిస్థితిని చక్కదిద్ధామన్నారు.