Friday, November 22, 2024

నాతో 40 మంది ఎమ్మెల్యేలున్న‌రు.. మ‌రో 10 మంది వ‌స్త‌రంటున్న ఏక్‌నాథ్ (వీడియో)

మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుంది. రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుటు చేస్తున్నారు. తన అనుచరులతో కలిసి నిన్న‌ గుజరాత్‌లోని సూరత్‌ వెళ్లారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత అసోంకు తన శిభిరాన్ని మార్చారు.

ఇవ్వాల (బుధవారం) తెల్లవారుజామున గువాహటి విమానాశ్రయానికి చేరుకున్న ఏక్‌నాథ్‌ షిండే.. తన వెంట మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు. బాలాసాహెబ్‌ ఠాక్రే కోరుకున్న హిందుత్వను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విమానాశ్రయంలో శివసేన చీలిక వర్గానికి బీజేపీ ఎమ్మెల్యే సెశాంతా బెర్గొహైన్‌ స్వాగతం పలకడం విశేషం.

కాగా, శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే ప్ర‌స్తుతానికి తన ద‌గ్గ‌ర‌ 40 ఎమ్మెల్యేలు ఉన్నార‌ని, ఇంకా మ‌రో 10 మంది ఎమ్మెల్యేలు కూడా వ‌స్తార‌ని చెబుతున్నారు. వీరిలో 33 మంది శివసేన ఎమ్మెల్యలు, ఏడుగురు స్వంతంత్రులున్నారు. దీంతో ఉద్ధవ్‌ నేతృత్వంలోని ఎంవీఏ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో సీఎం ఉద్ధ‌వ్ ఇవ్వాల అత్య‌వ‌స‌రంగా మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement