Saturday, November 23, 2024

న‌న్ను అరెస్ట్ చేస్తే అమెరికాలో పెను విధ్వంసం జ‌రిగేది.. ట్రంప్

గ‌తంలో అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ ఓ మ‌హిళ‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నార‌ని.. ఆ విష‌యం బ‌య‌టికి రాకుండా ఆమెకు న‌గ‌దుని ముట్ట‌చెప్పార‌ని అమెరికా అధికారులు ఆరోపించారు.కాగా పోర్న్ స్టార్ స్టోమీ డేనియల్స్ తో ట్రంప్ ఈ వ్యవహారం నడిపారని, దీనిపై విచారణ జరుగుతోందని చెప్పారు.అరెస్టు వ్యవహారంపై మన్ హట్టన్ డిస్ట్రిక్ అటార్నీ అల్విన్ బ్రాగ్ స్పందించారు. ట్రంప్ ను అరెస్ట్ చేసేందుకు తాము ఎలాంటి ప్రయత్నం చేయలేదని, ఆయనే తప్పుగా ఊహించుకుంటున్నారని అన్నారు. ఈమేరకు రిపబ్లికన్ పార్టీ కమిటీ చైర్మన్ కు మన్ హట్టన్ డిస్ట్రిక్ అటార్నీ కార్యాలయం నుంచి ఓ లేఖ కూడా రాసింది. అరెస్టుకు సంబంధించిన ప్రచారమంతా ట్రంప్ ఊహేనని స్పష్టంచేశారు.బ్రాగ్ ఆఫీస్ వివరణపై శనివారం ట్రంప్ స్పందించారు.

తనను అరెస్ట్ చేస్తే అమెరికాలో పెను విధ్వంసం జరిగి ఉండేదని హెచ్చరించారు. ఓ మాజీ అధ్యక్షుడిని, అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే అత్యధిక ఓట్లు సాధించిన నేతను.. ఎలాంటి తప్పుచేయని వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారని ట్రంప్ ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలతో అదుపులోకి తీసుకుంటే దేశంలో కనీవినీ ఎరగని విధ్వంసం జరుగుతుందని ట్రంప్ హెచ్చరించారు.కాగా ట్రంప్ మరోసారి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ రిపబ్లికన్ల మద్దతు కూడగట్టేందుకు పావులు కదుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement