Tuesday, November 26, 2024

Chiru | నేన‌లా చెప్ప‌లేదు.. మీడియా త‌ప్పుగా అర్థం చేసుకుంది: చిరంజీవి

తాను కేన్స‌ర్ బారిన ప‌డ్డాన‌ని, దాన్నుంచి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌న్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే.. నేను చెప్పిన దాన్ని మీడియా త‌ప్పుగా అర్థం చేసుకోవ‌డం వ‌ల్లే ఈ పొర‌పాటు జ‌రిగింద‌న్నారు. దీనికి సంబంధించి ఓ ట్వీట్ ద్వారా వివ‌రించారు.

ఇవ్వాల (శనివారం) కొద్ది సేపటి క్రితం నేనొక కేన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా కేన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే కేన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non – cancerous polypsని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది కేన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు, స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే అన్నాన‌ని చిరు తెలిపారు.

అయితే.. కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో ‘నేను కేన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement