తాను మధ్య తరగతివాడినని మెర్సిడెస్ బెంజ్ కారుని తాను కొనలేనని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మెర్సిడెస్ బెంజ్ కారు దర చాలా ఖరీదైనదని అన్నారు. ఈ మేరకు భారత్ లో ఉత్పత్తి పెంచి కాస్త కారు ధరలు తగ్గించాలని మెర్సిడెస్ బెంజ్ ఇండియాకు సూచన చేశారు. భారత్లో తమ కార్ల ఉత్పత్తిని పెంచాలని విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియాను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. దాని వల్ల ధర తగ్గుతుందని, ప్రజలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారని చెప్పారు. ధర ఎక్కువగా ఉండటంతో ఈ కారు తాను కూడా కొనలేనని సరదాగా వ్యాఖ్యానించారు. పుణెలోని చకన్ తయారీ యూనిట్లో దేశీయంగా అసెంబుల్ చేసిన EQS 580 4MATIC EVని ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘మీరు ఉత్పత్తి పెంచండి. అప్పుడు ధర తగ్గే అవకాశం ఉంటుంది. మేమంతా మధ్యతరగతి వాళ్లం. ఈ కారు నేను కూడా కొనలేను’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ సరికొత్త ఈవీ ధర రూ.1.55 కోట్లుగా ఉంది.
నేను మధ్యతరగతి వాడ్ని-మెర్సిడెస్ బెంజ్ కారుని కొనలేను-కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
Advertisement
తాజా వార్తలు
Advertisement