తాను హిందువునేనని..అవసరం అయతే బీఫ్ ని తింటానని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం సిద్ధరామయ్య.
కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో బీఫ్ తినడం పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై సిద్ధరామయ్య విమర్శలు చేశారు. ఆయన తాజాగా విషయం ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తున్నాయి. కర్ణాటకలోని తుమ్ముకూరు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వ, ఆర్ఎస్ఎస్ పై విమర్శలు చేశారు.” నేను హిందువును ఇప్పటివరకు బీఫ్ తినలేదు కానీ.. అవసరమనుకుంటే బీఫ్ తింటాను.నన్ను ప్రశ్నించడానికి మీరెవరు.. ఒక వర్గానికి చెందిన వాళ్లు మాత్రమే బీఫ్ తినరు. హిందువులు, క్రిస్టియన్లు కూడా బీఫ్ తింటారు. కర్ణాటక అసెంబ్లీలో కూడా ఒకసారి ఈ విషయం చెప్పాను. నన్ను తినొద్దు అని చెప్పడానికి మీరెవరని సిద్ధరామయ్య ప్రశ్నించారు. మతాల మధ్య ఆర్ఎస్ఎస్ చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తోందన్నారు. బీఫ్ తినడం ఆహారపు అలవాటు అని, ముస్లింలు మాత్రమే బీఫ్ తినరు అని అన్నారు. కర్ణాటకలో బీఫ్ తినడం పై గత జనవరి నుంచి నిషేధం విధించింది బిజెపి ప్రభుత్వం. దీనిపై పలు విమర్శలు తలెత్తాయి తాజాగా సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
నేను హిందువునే – అవసరమైతే బీఫ్ తింటా – మాజీ సీఎం సిద్ధరామయ్య
Advertisement
తాజా వార్తలు
Advertisement