సునీల్ హీరోగా నటించిన ‘భీమవరం బుల్లోడు’ సినిమాలో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది హీరోయిన్ ఎస్తెర్. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా… ఆ తర్వాత ‘గరంలో’ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది ఈ అమ్మడు. అంతేకాదు ‘జయ జానకి నాయక’ చిత్రంలో ఓ పాత్రలోనూ నటించింది. ఆ తర్వాత టాలీవుడ్‌కి దూరమైన ఈ భామ ఈ మధ్య ఓ టీవీ షోలో కనిపించింది. అలాగే యూట్యూబ్‌లో ఇంటర్వ్యూ ఇస్తూ తాను ఫీల్డ్‌లోనే ఉన్నాననే విషయాన్ని గుర్తు చేస్తోంది.
కేవలం ఒక్క సినిమాతోనే రాణించి సినిమా ఆఫర్లు లేక ఖాళీ అయిపోయిన ఎస్తెర్ తాజాగా చిత్ర పరిశ్రమ గురించి, సినిమాలో జరిగే ఘటనల గురించి ఓపెన్ అయ్యింది. తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌ని ఎదుర్కొన్నట్టు బోల్డ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆఫర్స్ రావాలంటే కమిట్‌మెంట్ అడిగారని తెలిపింది. ఆ కమిట్‌మెంట్‌కి ఒప్పుకోకపోతే కెరీర్ ఇక్కడితోనే ఆగిపోతుందని తనని బెదిరించినట్టు వెల్లడించింది. క్యాస్టింగ్ కౌచ్‌ని తాను కూడా ఫేస్ చేసినట్టు చెప్పింది ఎస్తెర్. అయితే వాళ్లు ముందుగా పరోక్షంగా కమిట్‌మెంట్ గురించి అర్థమయ్యేలా చెబుతారని, ‘నీకంటే వెనకొచ్చిన వాళ్లు ముందుకు వెళ్లిపోతారు. నువ్వు మాట వినకపోతే ఇక్కడే ఆగిపోతావ్. చాలా మంది హీరోయిన్లకి ఇలానే అయ్యింది’ అని తనతో అన్నారని పేర్కొంది ఎస్తెర్.
అయితే.. సినిమా అంటే తనకిష్టమని, కానీ అదే లైఫ్ కాదని చెప్పింది ఎస్తేర్. దానికోసం దిగజారాల్సిన అవసరం లేదని పేర్కొంది. అందుకే తాను కమింట్‌మెంట్‌కి నో చెప్పిందట. సినిమా అవకాశాలు రావాలంటే అదొక్కటే దారి అనుకుంటే ఆ సినిమాలు తనకు అవసరం లేదని తేల్చి చెప్పేసింది. ఈ క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఒక్కరిది తప్పు అని చెప్పలేమని, వాళ్లు అడగకపోయినా ఆఫర్ చేసే వాళ్లున్నారని, ఆఫర్ చేసే వాళ్లు లేకపోయినా అడిగే వాళ్లున్నారని చెప్పింది. నాకు ఏం కావాలో అది చెబుతానని, ఈ విషయంలో ఎవరినీ బ్లేమ్ చేయాలనుకోవడం లేదని చెప్పిన ఎస్తెర్.. తెలుగులో అవకాశాలు లేకపోయినా కన్నడ ఇండస్ట్రీ నుంచి తనకు మంచి ఆఫర్స్ వచ్చాయని పేర్కొంది.