Wednesday, November 20, 2024

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌తో హైదరాబాద్‌ ప్రతిష్ట మరింత పెరుగుతుంది: సీజేఐ ఎన్‌వీ రమణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం వల్ల హైదరాబాద్‌కు మరింత పేరు వస్తుందని సీజేఐ ఎన్‌వీ రమణ అన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో అంతర్‌జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం కొనసాగుతోందన్నారు. శనివారం గచ్చిబౌలిలోని ఐక్య పక్కన ఐఏఎంసీ శాశ్వత భవన నిర్మాణానికి ట్రస్ట్‌ రూపకర్త జస్టిస్‌ రమణ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ, గచ్చిబౌలిలో విలువైన భూమిని కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కేంద్రం వల్ల హైదరాబాద్‌కు మరింత మంచి పేరు వస్తుందని సింగపూర్‌లా హైదరాబాద్‌ కేంద్రం కూడా ప్రపంచ ఖ్యాతి పొందాలన్నారు. వచ్చే ఏడాది ఈ సమయానికి నిర్మాణం పూర్తి కావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ హిమాకోహ్లీ, మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌ అలీ, కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement