Sunday, November 17, 2024

Spl Story | గ్రీనరీ అండ్​ కూల్​.. జూలో ప్రత్యేక చర్యలు

వాటర్​ ఫౌంటేన్ల కింద సేదతీరుతున్న ఏనుగులు.. నీటి కొలనులో హాయిగా చిల్​ అవుతున్న పెద్దపులి.. ఎండదెబ్బ తగలకుండా వాటర్​ పైప్​తో నీళ్లు పడుతుంటే రిలాక్స్​ అవుతున్న తాబేలు.. ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్​ జూలో  కనిపించే దృశ్యాలు.. దంచికొడుతున్న ఎండలతో జంతువులు, పక్షులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జూలోని పలు షెడ్స్​ని కూల్​గా ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిసరాల్లో గ్రీనరీతోపాటు, నిరంతరం నీరు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

మొన్నటిదాకా కాస్త పర్వాలేదు అనిపించిన వాతావరణం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అకాల వర్షాలతో కొన్ని రోజులు చల్లబడ్డ వాతావరణం.. ఇప్పుడు దంచికొడుతున్న ఎండలతో భగ భగ మంటోంది.  హైదరాబాద్​తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మధ్యాహ్నం వేళ జనాలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్​ సిటీలో రోడ్లపై అంతగా ట్రాఫిక్​ ఉండడం లేదు. ఇక రాత్రివేళ అయితే ఉక్కపోతతో ఇబ్బంది తప్పడం లేదు. దీంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నిరంతరం ఆన్​లో ఉండడంతో విద్యుత్​ వినియోగం కూడా పెరిగింది. ఇక హైదరాబాద్​లోని జూలో జంతువులు, పక్షులు, సరీసృపాల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

హైదరాబాద్​లోని నెహ్రూ జూలాజికల్​ పార్క్​లో జంతు సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వేసవి కాలం రావడంతో పాటు నగరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఎండ వేడి నుంచి రక్షణ చర్యలు చేపట్టారు. జూలోని జంతువుల గుడారాలకు కనీసం 6 అంగుళాల వెడల్పు ఉన్న 1000 కిలోల తుంగ గడ్డితో సహా.. రాత్రిపూట పైకప్పు కప్పేసి ఉంచుతున్నారు. శాఖాహార పక్షులు, జంతువుల ఎన్‌క్లోజర్‌లకు తాత్కాలిక సన్​ ప్రొటెక్షన్​ షెడ్స్​ ఏర్పాటు చేశారు. జంతువులు కూల్​ కూల్​గా ఉండేందుకు అధికారులు అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జంతు ప్రదర్శనశాల, దాని పరిసర ప్రాంతాలను గ్రీన్​గా.. కూల్​గా ఉంచడానికి జంతుప్రదర్శనశాలలోని పచ్చిక బయళ్లు, ఉద్యానవనాలు నిరంతరం వాటర్​ స్ర్పేయర్లను ఆన్​ చేస్తున్నారు. 200 కంటే ఎక్కువ స్ప్రింక్లర్లు.. చిన్న రెయిన్ గన్‌లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కొన్ని జంతువుల ఎన్‌క్లోజర్‌లలో వీటిని అధికంగా అమర్చడం గమనార్హం. స్ప్రింక్లర్‌లతో పాటు సరీసృపాల గృహం.. కొత్త మకావ్‌లు, అన్ని ఫెసెంట్రీ.. బర్డ్​ నెస్ట్​ ప్రాంతాలలో 1000 కంటే ఎక్కువ ఫాగర్‌ల ను ఏర్పాటు చేశారు. ఇవి కోతులు, మాంసాహార జంతువులతోపాటు.. అన్ని రకాలుగా తినే వాటి ఎన్‌క్లోజర్‌లలో ఏర్పాటు చేసిన వాటికంటే 80 ఎయిర్-కూలర్‌లకు అదనంగా ఉన్నాయి. అలాగే, రాత్రిపూట జంతువుల షెడ్స్​, వాటి పిల్లల పెంపకం కేంద్రంలో ఎయిర్ కండిషనర్లు.. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కూడా ఉన్నాయి.

- Advertisement -

కాగా, జంతువులు డీ హైడ్రేషన్​కి గురికాకుండా ఉండేందుకు​.. వేసవి తాపం నుంచి వాటిని కాపాడేలా గ్లూకాన్-డి, విటమిన్-సి.. బి-కాంప్లెక్స్ సప్లిమెంట్‌లతో పాటు తగిన మొత్తంలో చల్లని నీరు, థర్మో కేర్ ద్రవాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. జంతువులకు చల్లదనాన్ని అందించే ఇతర దశల్లో బాతుల చెరువు, కొంగల చెరువు ప్రాంతానికి షేడ్ నెట్ కూడా ఏర్పాటు చేశారు. అన్ని ఆవరణలకు ‘కష్కష్ తట్టి’ అందించడం.. కోతులు, ప్రైమేట్‌లకు సీజనల్ ఫ్రూట్స్​ అయిన పుచ్చకాయ, సీతాఫలం, సిట్రస్ రకాల పండ్లను అందజేస్తున్నారు. క్యూరేటర్ ప్రశాంత్ బాజీరావు పాటిల్ వేసవికాలంలో జూలో చేపట్టిన చర్యలు, ఏర్పాట్లను పరిశీలించారు. జూలోని అన్ని జంతువులపై నిరంతరం నిఘా ఉంచాలని క్షేత్ర సిబ్బందిని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement