Tuesday, November 19, 2024

ఎండలతో జాగ్రత్త: వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మూడురోజులూ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, ఉష్ణోగ్రత 40 నుంచి 43 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకే వెళ్లవద్దని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ ఎండ అధికంగా ఉంటుందని, ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య తీవ్రత అధికమని, విదర్భ నుంచి వడగాలులు వీయనున్నాయని అధికారులు హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల మీదుగా ఇవి వెళ్లనున్నాయని, ఈ కారణంతో చిన్న పిల్లలను బయటకు పంపించవచ్చని అధికారులు సలహా ఇస్తున్నారు. వీరితో పాటు దీర్ఘకాలిక రోగాలున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. అటు ఏపీలోనూ విజయవాడ గుంటూరులో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement