Friday, November 22, 2024

హైదరాబాద్‌ టు షిరిడీ వయా శనిసింగనాపూర్‌, ఎల్లోరా

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: హైదరాబాద్‌ నుంచి షిరిడీ వయా శనిసింగాపూర్‌, ఎల్లోరా టూర్‌ని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) ప్రారంభిం చింది. ఈ సందర్భంగా.. హైదరాబాద్‌ నుంచి షిరిడీకి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్‌ ప్యాకేజిని ప్రారంభించినట్లు టీఎస్‌టీడీసీ ఎండీ మనోహర్‌రావు తెలిపారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఈ ప్రయాణం మొదలవుతుంది. ఆయా రోజుల్లో సాయంత్రం 4 గంటలకు బేగంపేటలోని టూరిజం ప్లాజా నుంచి ప్రత్యేక బస్సు సందర్శకులతో బయలుదేరుతుంది. మూడ్రోజులపాటు సాగే ఈ టూర్‌కు పెద్దలకు రూ.3,250 మరియు పిల్లలకు రూ.2,060 చెల్లించవలసి ఉంటుంది. వెళ్లే ప్రయాణంలో శనిసింగనాపూర్‌ని సందర్శించి, తిరుగు ప్రయాణంలో అజంతా ఎల్లోరాను సందర్శించేలా టూర్‌ను రూపొందించారు.

షిరిడీలో ఒక రాత్రి బస ఏర్పాటు చేస్తారు. మెత్తం మూడు రోజులుగా సాగే ఈ టూర్‌ని తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌లోబుక్‌ చేసుకోవచ్చు. సందేహాల కోసం 1800-425- 46464 టొల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేసి సంప్రదించవచ్చు. షిరిడీ సాయిబాబా ఆలయ అధికారులు కొవిడ్‌ నిబంధనలను అనుసరించి వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌, ఫొటో గుర్తింపు కార్డు అడుగుతున్నందున దర్శనం టికెట్లను ఎవరికి వారే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని టీఎస్‌టీడీసీ ఎండీ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement