హైదరాబాద్‌లో బీజేపీ చేయాలనుకున్న సర్జికల్ స్ట్రైక్ విఫలమైందని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అరెస్ట్ అయిన బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ ఈ మధ్య చేసిన విద్వేషపూరిత ప్రసంగాల వివాదంపై ఆయన మాట్లాడారు. ‘‘హింస గురించి మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బహిష్కరించినట్టు ప్రకటించినా.. బీజేపీ సహాయం చేస్తుందనేది బహిరంగ రహస్యం.
ద్వేషపూరిత ప్రసంగాల తర్వాత అల్లర్లు చెలరేగితే ఆ తర్వాత రెచ్చిపోయి దాడులకు తెగబడాలని ప్లాన్చేశారు. ఇది హైదరాబాద్‌లో బీజేపీ చేసిన సర్జికల్ స్ట్రైక్ ప్లాన్. శాంతియుతంగా ఉన్నందుకు ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నా. హైదరాబాద్‌లో బీజేపీ చేసిన సర్జికల్ స్ట్రైక్‌ను విఫలం చేశారు”అని ఒవైసీ అన్నారు.