Tuesday, November 26, 2024

పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్.. చెల్లింపులపై ట్రాఫిక్ జాయింట్ సీపీ ఎమన్నారంటే..

తెలంగాణ వ్యాప్తంగా రాయితీలతో పెండింగ్‌ చలానాల ‘ఈ-లోక్‌ అదాలత్‌’ నిర్వహించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. మార్చి నెల ప్రారంభం నుంచి చివరి వరకు పెండింగ్ చలానాలు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆన్ లైన్ ద్వారానే పెండింగ్ చలాన్ చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ చాలన్ సిస్టమ్ ద్వారా అన్ని పెండింగ్ చలనాలు చెల్లించాలన్నారు. ఆన్లైన్ అనగా ఫోన్ పే, పేటీంఏం, గూగుల్ పే వంటి సేవలు ఉపయోగించుకోవచ్చు అని సూచించారు. మీ సేవ, ఈ సేవలో చెలించవచ్చు అని అన్నారు.  రేపటి నుంచి మార్చి 30వ తేది వరుకు ట్రాఫిక్ చలనాలు రాయితీ అమలు అవుతుందన్నారు.

కరోనా కారణంగా అందరూ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ద్విచక్ర వాహనలకి 25 శాతం రాయితీ, నో మాస్క్ చలనాలు కూడా రూ.1000 ఉంటే రూ.100 కడితే చాలన్నారు. పేద వర్గాలకు వెసుల బాటు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కేవలం హైదరాబాద్ లోనే 500 కోట్ల రూపాయల చాలనాల ( 1.75 లక్షల చలనాలు) పెండింగ్ లో ఉన్నాయన్నారు. చెల్లింపులు అన్ని ఆన్ లైన్ ద్వారా చేసుకోవచ్చని చెప్పారు. తెలంగాణ ఈ చాలన్ వెబ్ సైట్ లో ప్రాసెస్ చేస్తుందని వివరించారు. నెల రోజుల వేసులబాటులో చాలన్ కట్టకపోతే తగిన చర్యలు స్పెషల్ డ్రైవ్ పెట్టీ చేస్తామని చెప్పారు. ఆటోలపై నిబంధనలు విధించామన్న జాయింట్ సీపీ.. హైదరాబాద్ సిటీ లో పెర్మిషన్ ఉన్నవి కాకుండా.. బయట జిల్లాల నుంచి వచ్చే వాటిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆటోలో మీటర్ వేసే పరిస్థితి లేదని రంగనాథ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement