– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
ఇండియా సైన్స్ ఫెస్టివల్ 2023 పోస్టర్ని ఇవ్వాల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత థౌతం, ఫాస్ట్ ఇండియా CEO జయంత్ కృష్ణ, డైరెక్టర్ జనరల్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH) అజిత్ రంగ్నేకర్, ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవ్ దేవ్ సరస్వత్ ఉన్నారు, ఇక.. ప్రభుత్వ మాజీ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త, ప్రొఫెసర్ కె. విజయరాఘవన్, ISF 2023కి చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్‌గా వ్యవహరించనున్నారు.
ఫౌండేషన్ ఫర్ అడ్వాన్సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియా (ఫాస్ట్ ఇండియా) తన ఫ్లాగ్‌షిప్ సైన్స్ కమ్యూనికేషన్ ఈవెంట్‌కి చెందిన 4వ ఎడిషన్, ఇండియా సైన్స్ ఫెస్టివల్, ISF 2023ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలపింది. ISF 2023 తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (TSIC) ద్వారా తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ఫాస్ట్ ఇండియా ఈ ఈవెంట్‌ని 2023 జనవరిలో నిర్వహించనుంది. ఈ ఫెస్టివల్‌కి దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలోని వివిధ వ్యక్తులు, సంస్థలు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వారు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలు ప్రసంగాలు, ప్రదర్శనల మేలవింపుతో కూడిన వేడుకలు జరగనున్నాయి.
ఇక.. ఫెస్టివల్ 4వ ఎడిషన్‌ని నిర్వహించడానికి ఫాస్ట్ ఇండియా, TSIC మధ్య ఓ అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. హైదరాబాద్ గొప్ప సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ (STI) హబ్‌గా ఉండడం.. మంచి విద్యావిధానం, అద్భుతమైన కార్యనిర్వహణ కారణంగా ఈ ఫెస్టివల్‌కు హైదరాబాద్‌ని ఆతిథ్య నగరంగా ఎంపిక చేశారు.
కాగా, దీనికి సంబంధించి ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ “ఫాస్ట్ ఇండియా హైదరాబాద్‌ను పండుగకు గమ్యస్థానంగా ఎంచుకున్నందుకు సంతోషిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఈ సైన్స్ ఫెస్టివల్‌కి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోందని, విజ్ఞాన శాస్త్రాన్ని దాని విభిన్న ఫార్మాట్లలో నిర్వహించుకుకోవడం సంతోషంగా ఉంది”అన్నారు.
ఇక.. ISF 2023 ప్రోగ్రామ్‌లో ప్రముఖులతో సైన్స్ చర్చలు, ఇంటర్ డిసిప్లినరీ ప్యానెల్ డిస్కషన్‌లు, ఎగ్జిబిట్‌లు, ఇంటరాక్టివ్ ఇన్‌స్టాలేషన్‌లు, హ్యాండ్-ఆన్ వర్క్ షాప్‌లు, పాలసీ రౌండ్‌టేబుల్స్, బుక్ లాంచ్‌లు, ఫిల్మ్ స్క్రీనింగ్‌ల వంటి పలు ప్రదర్శనలు ఉండనున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన అన్ని కోణాలను అన్వేషించడానికి, వాటిని వాస్తవ ప్రపంచానికి కనెక్ట్ చేయడంలో సహాయపడటానికి, ISF 2023 విభిన్న రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది.
అంతేకాకుండా ISF 2023 ప్రోగ్రామ్ ఉచితంగా, అందరికీ అందుబాటులో ఉంటుంది. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఆరోగ్య నిపుణులు, పలువురు ఆవిష్కర్తలతో కలిసి చర్చించడానికి, కలిసి పురోగమించడానికి యువతకు ఇదో మంచి మార్గం కానుంది. సాధారణ ప్రజలను కనెక్ట్ చేయడానికి కూడా ఈ సైన్స్ ఫెస్టివల్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.