Tuesday, November 26, 2024

Exclusive | హైదరాబాద్ నుంచి మరో మూడు వందేభారత్​ రైళ్లు.. ఈ రూట్లలో తగ్గనున్న జర్నీ టైమ్​!​

రైలు ప్రయాణికులు గుడ్​ న్యూస్​.. హైదరాబాద్ నుంచి పలు రూట్లలో మరో మూడు వందే భారత్​ రైళ్లను ప్రారంభించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వాటిలో కాచిగూడ-యశ్వంత్‌పూర్ (బెంగళూరు), సికింద్రాబాద్-పుణె, సికింద్రాబాద్-నాగ్‌పూర్ రూట్​లు ఉండబోతున్నాయి. దీంతో ఈ రూట్లలో జర్నీ చేసే వారికి దాదాపు రెండు నుంచి మూడు గంటల సమయం ఆదా అవుతుందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

హైదరాబాద్ నుంచి వందేభారత్​ రైళ్లను ప్రవేశపెట్టబోయే మూడు మార్గాల్లో ఇప్పటికే​ యశ్వంత్‌పూర్, నాగ్‌పూర్ రూట్లలో ట్రయల్స్ పూర్తయ్యాయి. శతాబ్ది ఎక్స్ ప్రెస్ స్థానంలో పూణే రూట్​ నుంచి ఈ రైలు వచ్చే అవకాశం ఉంది. ఇక.. తిరుపతి, వైజాగ్ మార్గాల్లో హైదరాబాద్ నుంచి వందేభారత్ రైళ్ల సంఖ్య ఐదుకు చేరుతుంది. ఈ రైళ్లు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో నడిచేలా దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకుంంది. ఇప్పటికే తన రైలు నెట్‌వర్క్ ను అప్‌గ్రేడ్ చేసింది.

కాగా, హైదరాబాద్ నుండి బెంగుళూరుకు రైలు ప్రయాణం ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో 10-12 గంటల సమయం పడుతోంది. అయితే వందే భారత్ రైలు ఈ ప్రయాణ సమయాన్ని 8.3 గంటల్లోనే చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ రైలు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఉదయం 6 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.30 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంఉటంది. మరో రూట్​లో యశ్వంత్‌పూర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు రైలు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు కాచిగూడ చేరుకునేలా ప్లాన్​ చేస్తున్నారు.

- Advertisement -

ఇక.. సికింద్రాబాద్-పూణే రూట్​లో 8.25 గంటల సమయం పట్టే శతాబ్ది సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్.. వందే భారత్‌తో రీ ప్లేస్​ కానుంది. దీంతో ఈ రూట్​లో జర్నీ చేసే వారికి ప్రయాణ సమయం చాలా మట్టకు తగ్గుతుంది. సికింద్రాబాద్‌-నాగ్‌పూర్‌ మార్గంలో కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బల్హర్షాలో స్టాప్‌లు ఉంటాయి. ప్రస్తుత ప్రయాణ సమయం 7 గంటల 30 నిమిషాలు కాగా, వందేభారత్​ కొత్త రైలు రాకతో ప్రయాణంలో రెండు గంటల సమయం ఆదా అవుతుందని అంతా భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement