Tuesday, November 26, 2024

100శాతం మురుగునీటి శుద్ధి చేస్తాం.. హైదరాబాద్​ని నెంబర్​ సిటీగా చేస్తాం: మంత్రి కేటీఆర్​

హైదరాబాద్​ ఇక 100శాతం సీవరేజీ ట్రీట్​మెంట్​సిటీగా మారుతుందన్నారు మంత్రి కేటీఆర్​.  నగరవ్యాప్తంగా మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్‌టిపి) నిర్మాణాన్ని ఇవ్వాల (శనివారం) ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. 2023 నాటికి 1259 మిలియన్ లీటర్ల పర్ డే (ఎంఎల్‌డి) సామర్థ్యంతో ఎస్‌టీపీల పనులు పూర్తి చేస్తామని తెలిపారు.  

2023 వేసవి నాటికి 1259 MLD సామర్థ్యంతో శుద్ధి చేసే STPలు పూర్తవుతాయి, దీంతో100% మురుగునీటిని శుద్ధి చేసిన మొదటి నగరంగా హైదరాబాద్‌ అవతరిస్తుంది” అని KTR తెలిపారు. మొత్తం 31 వికేంద్రీకృత మురుగునీటి శుద్ధి కర్మాగారాలు (STP) నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌ను 100 శాతం మురుగునీటి శుద్ధి సామర్థ్యానికి ఇవి చేరువ చేస్తాయని తెలిపారు.

రూ. 3866 కోట్ల వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) ప్రస్తుతం నిర్మిస్తున్న 31 STPలు 1259 MLD సామర్థ్యం కలిగి ఉన్నాయి. హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాలైన ఫతేనగర్, పరికి చెరువు, వెన్నెలగడ్డ, శివాలయ నగర్, ఖాజాకుంట, ముళ్లకత్వ చెరువుతో పాటు 376 ఎంఎల్‌డీల 17 ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. ఇవి హుస్సేన్ సాగర్ మురుగునీటి సమస్యను పరిష్కరిస్తాయని HMWSSB ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement