Saturday, November 23, 2024

అలర్ట్.. డేంజర్ బెల్స్!

తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్‌ రాకుండానే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం బయటకి రావాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతోన్న ఉష్ణోగ్రతలు భయాన్ని కలిగిస్తున్నాయి. హైదరాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తదితర జిల్లాల్లో ఏకంగా 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి. మిగత ప్రాంతాల్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 38.8 నుంచి 42.7 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఇక, హైదరాబాద్‌లోనూ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఖైరతాబాద్‌ పరిధిలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మార్చిలోనే ఎండలు ఈ రేంజ్‌లో ఉంటే.. మే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎండలు మరింత పెరగనున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement