Saturday, November 23, 2024

సింహాల‌ను గుర్తించేందుకు హైద‌రాబాద్ సాఫ్ట్ వేర్ – నంబ‌ర్ల‌ను కేటాయిస్తుంద‌ట‌

వ‌న్య‌ప్రాణుల‌ను గుర్తించేందుకు సాధార‌ణంగా శ‌రీర‌భాగాల ఆకారాలు, మ‌చ్చ‌ల‌ను ఆధారం చేసుకుంటారు. అయితే ఏషియాటిక్ సింహాల‌న్నీ చూడ‌టానికి ఒకేలా ఉండ‌టంతో వాటిని గుర్తించ‌డం క‌ష్ట‌మ‌వుతోంది. కాగా వాటి మూతిపై ఉండే వెంట్రుకలు, మచ్చల్లోని అత్యంత సూక్ష్మంగా ఉండే తేడాలను హైదరాబాద్‌కు చెందిన టెలియోల్యాబ్స్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థ కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ గుర్తిస్తుంది. సింహాలకు ఆధార్‌ తరహాలో నంబర్లను కేటాయిస్తుంది. డాటాను కూడా తయారు చేస్తుంది. ఫలితంగా సింహాల జనాభాను గుర్తించి వాటి పరిరక్షణకు తగిన చర్యలు తీసుకునే వీలు కలుగుతుంది’ అని అమిత్‌సింగ్‌ వివరించారు. గిర్‌ అభయారణ్యం అధికారులు ఇప్పటికే ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యంలో ఉండే విభిన్నమైన ఆషియాటిక్‌ సింహాలను గుర్తించేందుకు హైదరాబాద్‌కు చెందిన టెలియోల్యాబ్స్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థ కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ (సాఫ్ట్‌వేర్‌ విత్‌ ఇంటెలిజెంట్‌ మార్కింగ్‌ బేస్డ్‌ ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ ఏషియాటిక్‌ లయన్స్‌-సింబ)ను అభివృద్ధి చేసింది. అంతరించిపోతున్న ఏషియాటిక్‌ సింహాలను పరిరక్షించుకునేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ దోహదపడుతుందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్‌ సింగ్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement