లాక్‌డౌన్ సమయంలో నమోదు చేసిన కేసుల పెండెన్సీని క్లియర్ చేసేందుకు నగర పోలీసులు కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు. పెండింగ్ చలాన్లు క్లియర్ భారీ డిస్కౌంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా లాక్ డౌన్ సమయం లో నమోదైన కేసులకు డిస్కౌంట్ ప్రకటించారు.2020-21 లాక్‌డౌన్ టైంలో వివిధ ఉల్లంఘనలపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద పలు సెక్షన్లతో పెట్టీ కేసులు నమోదు చేశారు. రూ. 1000 వరకు జరిమానాలు విధించారు. ఆ సమయంలో నమోదైన దాదాపు 3 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండగా, వాటిని పరిష్కరించుకునేందుకు పోలీసులు భారీ డిస్కౌంట్‌ను కల్పించా రు.
ఉల్లంఘనలపై నమోదైన ఒక్కో సెక్షన్‌కు కేవలం పది రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. ఈ అవకాశం 2 నుంచి 8వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని, ఉల్లంఘనదారులు సద్వినియోగం చేసుకోవాలని నగర అదనపు పోలీస్ కమిషనర్(క్రైమ్స్) ఏఆర్ శ్రీనివాస్ సూచించారు.
Good News: రూ.10 చెల్లిస్తే కేసు క్లోజ్.. లాక్‌డౌన్ రాయితీ 99%
Advertisement
తాజా వార్తలు
Advertisement