Friday, November 22, 2024

బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ లీడర్లను లేపేసేందుకు ప్లాన్​.. హైదరాబాద్​లో టెర్రర్​ కుట్ర భగ్నం

పాకిస్థాన్‌లో ఉన్న టెర్రరిస్టు లీడర్ల సూచన మేరకు తెలంగాణలో పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు కొంతమంది ప్లాన్​చేశారు. ఈ ఆపరేషన్​లో భాగంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను చంపాలన్నది వారి ప్లాన్.​ అంతేకాకుండా  గ్రెనేడ్లతో రాష్ట్రంలో ‘విధ్వంసక’ కార్యకలాపాలు నిర్వహించేందుకు పేలుడు పదార్థాలను కూడా సేకరించారు. అయితే.. టెర్రర్​ ప్లాన్​ని తెలంగాణ ఇంటెలిజెన్స్​ విభాగం, టాస్క్​ఫోర్స్​ బృందం పసిగట్టాయి. ఇవ్వాల (ఆదివారం) అనుమానితులను వారి ఇళ్ల నుంచి తీసుకెళ్లిన స్పెషల్​ టాస్క్​ఫోర్స్​ బృందం ఎంక్వైరీ చేస్తోంది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం, కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం ఆదివారం సంయుక్త ఆపరేషన్‌లో మలక్‌పేట ప్రాంతానికి చెందిన కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుంది. దీంతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను హత్య చేయాలనే ప్లాన్‌ను క్రాక్​ చేశారు పోలీసులు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మలక్‌పేట్‌లోని మూసారాంబాగ్ ప్రాంతానికి చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) కార్యకర్త మహ్మద్ అబ్దుల్ జాహెద్, అతని సహచరులు మాజ్.. సమీయుద్దీన్‌లపై నేరపూరిత కుట్ర కేసు నమోదు చేసింది.

ఇవ్వాల మలక్‌పేట నివాసి అబ్దుల్ జాహెద్ (39) అతని సహచరులతో కలిసి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్‌లను సేకరించారు. తెలంగాణలోని హైదరాబాదులో సంచలనాత్మక ఉగ్రదాడులకు వెళ్తున్నారని నిర్దిష్ట సమాచారం అందింది. బృందం వేగంగా పనిచేసి ఈరోజు మలక్‌పేటకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుంది అని పోలీసులు తెలిపారు.

జాహెద్ అతని సోదరుడు మహమ్మద్ అబ్దుల్ షాహెద్ అకా షాహెద్ బిలాల్, హర్కత్-ఉల్-జిహాద్-ఇ-ఇస్లామీకి చెందిన హతమైన ఉగ్రవాది. 2005 అక్టోబర్ 12న బేగంపేట టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో జరిగిన ఆత్మాహుతి దాడి కేసులో నిందితుల్లో ఒకడు. కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ దాడిలో బంగ్లాదేశ్‌కు చెందిన ఆత్మాహుతి బాంబర్ మౌతాసిమ్ బిలాల్ హతమయ్యాడు. ఒక హోంగార్డు చనిపోయాడు.

- Advertisement -

పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణ ప్రకారం.. అబ్దుల్ జాహెద్ గతంలో 2005లో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ కార్యాలయం బేగంపేటపై ఆత్మాహుతి దాడితో సహా హైదరాబాద్‌లోని పలు ఉగ్రవాద సంబంధిత కేసుల్లో ప్రమేయం ఉన్నాడు. అతను పాకిస్థానీ ISI-LeT హ్యాండ్లర్లతో నిత్యం టచ్‌లో ఉండేవాడు.  

ఇక.. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు ఫర్హతుల్లా ఘోరీ అకా ఎఫ్‌జి, సిద్దిక్ బిన్ ఉస్మాన్ అకా రఫీక్ అకా అబు హమ్జాలా, అబ్దుల్ మజీద్ అకా ఛోటూ, హైదరాబాద్ నగరానికి చెందిన వారందరూ పరారీలో ఉన్నారు. వీరంతా ISI కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. గతంలో వారు స్థానిక యువకులను రిక్రూట్ చేసి, వారిని రాడికల్‌గా మార్చారు. 2002లో సాయిబాబా ఆలయం దిల్‌సుఖ్‌నగర్ సమీపంలో పేలుడు, ముంబైలోని ఘాట్‌కోపర్‌లో బస్సు పేలుడు.. 2005లో బేగంపేట టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై ఆత్మాహుతి దాడి వంటి ఉగ్రదాడులను అమలు చేశారు.

2004లో సికింద్రాబాద్‌లోని గణేష్‌ టెంపుల్‌ సమీపంలో పేలుళ్లకు కూడా ప్రయత్నించారు’’ అని పోలీసులు తెలిపారు. ఫర్హతుల్లా ఘోరీ, అబు హంజాలా, మజీద్‌లు తనతో పరిచయాలను పెంచుకున్నారని, హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్రవాద దాడులకు రిక్రూట్‌మెంట్‌ చేసేందుకు, జాహెద్‌కు ఆర్థిక సాయం చేశారని అదుల్ జాహెద్ విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

అబ్దుల్ జాహెద్ నుంచి రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, రూ. 3,91,800 విలువైన నికర నగదు, 2 మొబైల్ ఫోన్లు, ఒక హ్యాండ్ గ్రెనేడ్, రూ. 1,50,000 విలువైన నికర నగదు.. సమీయుద్దీన్ నుండి ఒక మొబైల్ ఫోన్, ఒక బుల్లెట్ మోటార్ సైకిల్, ఒక హ్యాండ్ గ్రెనేడ్ స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement