Saturday, November 23, 2024

పల్లెబాట పట్టిన జనం..!

తెలంగాణలో లాక్‌ డౌన్‌ విధించడంతో బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్న జనం.. పల్లె బాట పట్టారు. పెట్టేబేడా సర్దేసుకొని బస్సులు, రైళ్లలో సొంతూళ్లకు పయనమయ్యారు. కొందరు కార్లు, బైకులు ఇతర ప్రైవేటు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ప్రైవేట్‌ ఉద్యోగాలు చేస్తున్న వేలమంది వారం, పదిరోజుల పాటు సెలవులు పెట్టేసి సొంతూళ్ల బాటపట్టారు. ఆర్టీసీ బస్సులు ఉదయం 10 గంటల వరకే సర్వీసులు ఉండడంతో ఎంజీబీఎస్‌, జేబీఎస్ లో ప్రయాణికుల రద్దీ కనిపించింది. అక్కడి నుంచి జిల్లాలకు వెళ్లే బస్సుల్లో జనం పెద్ద సంఖ్యలో కనిపించారు. పలు రైళ్లలో కూడా ప్రయాణికుల రద్దీ కనిపించింది. కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలకు వెళ్లే వారితో ఆరంఘర్ చౌరస్తా వద్ద రద్దీ పెరిగింది. ఊర్లకు వెళ్లేందుకు వచ్చిన ప్రజలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం లేక ప్రైవేటు వాహణాలను ఆశ్రయిస్తున్నారు. తమ గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు పాట్లు పడుతున్నారు. ఆర్టీసీ బస్సుల సర్వీసులు కుదించడంతో ప్రైవేట్ వాహనదారులు ప్రయాణిల నుండి దండుకుంటున్నారు.

ఇదీ చదవండి: తెలంగాణలో అమల్లోకి వచ్చిన లాక్ డౌన్

Advertisement

తాజా వార్తలు

Advertisement