Saturday, November 23, 2024

తెలంగాణలో చలి పంజా.. గజగజ వణుకుతున్న ప్రజలు

తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రజలు గజగజ వణుకుతున్నారు. హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఉదయం వేళల్లో పొగమంచు కమ్మేస్తోంది. వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో చలి తీవ్రత పెరగనుందని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయని, ఫలితంగా చలి పెరుగుతోందని పేర్కొంది.

ఈశాన్య, వాయవ్య భారత్ నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణవైపు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో చలి తీవ్రత పెరుగుతోందని అధికారులు తెలిపారు. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలో పగటి వేళ పొడి వాతావరణం ఉంటుందని, రాత్రివేళ భూవాతావరణం త్వరగా చల్లబడం వల్ల చలి పెరుగుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈశాన్య, వాయవ్య భారత్‌ నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో పగలు పొడి వాతావరణం ఉంటుంది. రాత్రిపూట భూవాతావరణం త్వరగా చల్లబడి చలి పెరుగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఉదయం పూట పొగమంచు కురుస్తోంది. గాలిలో తేమ సాధారణం కన్నా 25 శాతం వరకూ అదనంగా పెరిగింది.

ఉదయం పూట పొగమంచు కురుస్తోందని, గాలిలో తేమ సాధారణం కంటే 25 శాతం అదనంగా పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. నిన్న(డిసెంబర్ 13) తెల్లవారుజామున కుమురంభీం జిల్లాలోని సిర్పూర్‌లో అత్యల్పంగా 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement