హైదరబాద్‌లోని మీర్‌పేటలో నెల రోజుల క్రితం బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసు నిందితులను ఇవ్వాల (బుధవారం) పోలీసులు అరెస్టు చేశారు. పాతబస్తీకి చెందిన ఓ బాలిక కుటుంబం 3 నెలల క్రితం మీర్ పేటలోని లెనిన్ నగర్ కు షిఫ్ట్ అయ్యింది. ఈ క్రమంలో ఆ బాలికపై కన్నేసిన షెరియన్ రథన్ సింగ్, అతని (మైనర్) స్నేహితుడు కలిసి బాలికను వేధింపులకు గురిచేశారు. తమ లైంగిక కోరికలు తీర్చుకోవాలన్న పథకం ప్రకారం వారు ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఆ బాలిక ఎటువెళ్లినా వారు అప్పటి నుండి అనుసరించారు.
ఇక.. నవంబరులో రథన్ సింగ్ తన స్నేహితుడు (జువైనల్)తో కలిసి బాలిక ఓ గుడికి వెళ్లినప్పుడు హోండా యాక్టివా బైక్‌పై ఫాలో అయ్యారు. ఆ తర్వాత ఆ బాలికను అనుసరిస్తూ మాయ మాటలు చెప్పి బైక్ ఎక్కించుకున్నారు. గుడి దగ్గర నుంచి బాలికను ఎవరూలేని నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అయితే.. గుడికి వెళ్లి వస్తానన్న తన కూతురు చాలాసేపు అవుతున్నా తిరిగి రాకపోవడంతో బాధితురాలి తల్లి వెతకడం ప్రారంభించిది.. ఈ క్రమంలో నిందితులు ఆ బాలికను మళ్లీ ఇంటి వద్ద వదిలిపెట్టారు.
ఈ విషయంపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట పోలీసులు అప్పటి నుంచి కేసు దర్యాప్తు విషయంలో సాంకేతిక డేటా, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించి నిందితులను బుధవారం అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన హోండా బైక్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలోనూ పలు సెక్షన్ల కింద కేసులున్నట్టు తెలుస్తోంది. కాగా, మైనర్ నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపగా, అతని తోటి నేరస్థుడిని జైలుకు తరలించారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) LB నగర్ త్వరితగతిన విచారణ జరిపి బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.