Saturday, November 23, 2024

దేశంలో అత్య‌ధిక ధ‌న‌వంతులు ఉన్న న‌గ‌రాల్లో రెండో స్థానంలో ‘హైద‌రాబాద్’

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక బిలియ‌నీర్లు ఉన్న దేశాల జాబితాలో ఇండియా మూడ‌వస్థానంలో నిలిచింది. కాగా 748బిలియ‌నీర్ల‌తో అమెరికా ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంది..554బిలియ‌నీర్ల‌లో చైనా సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక 145బిలియ‌నీర్ల‌తో ఇండియా థ‌ర్డ్ ప్లేస్ లో ఉంద‌ని నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2022సంవ‌త్సరానికి వెల్ల‌డించింది. ఇక దేశంలో అత్యధిక ధనవంతులు ఉన్న నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో నిలవ‌డం విశేషం. ముంబై మొదటి స్థానంలో ఉంది. 2021లో నికర ఆస్తి రూ.227 కోట్ల కంటే ఎక్కువగా ఉన్నవారిని ధనికులుగా పేర్కొన్నట్లు నివేదిక వెల్లడించింది. ముంబైలో ధనవంతుల సంఖ్య 1596 ఉండగా.. హైదరాబాద్లో 467 మంది ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. తర్వాతి స్థానాల్లో పుణేలో 360, బెంగళూర్ లో 352 మంది, కోల్ కతాలో 257, ఢిల్లీలో 210, చెన్నైలో 160 మంది, అహ్మదాబాద్ 121 మంది ధనికులు ఉన్నట్లుగా నివేదిక వెళ్లడించింది. భారతీయ నగరాల్లో బెంగళూర్ హైఎస్ట్ గా ధనికుల సంఖ్య పెరిగిందని నివేదిక తెలియజేసింది. దాదాపుగా 17.1 గ్రోత్ రేట్ ను సాధించింది బెంగళూరు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement