Saturday, November 23, 2024

Spl Story: ఫుడ్డీస్​కి స్వర్గధామం హైదరాబాద్​.. అందులో ఈ హోటల్​ 24/7  స్పెషల్​!

చిటపట చినుకులు.. కూల్​ ​ వెదర్​ని ఎంజాయ్​ చేస్తున్నారు హైదరాబాద్​ సిటీ జనం. వీకెండ్స్​లో ఎంచక్కా బయటికి వెళ్లి ఫుడ్​ ఎంజాయ్​ చేయాలనుకుంటే మాత్రం రాత్రి 11 నుంచి 12  గంటల వరకే స్టాల్స్​, హోటల్స్​ ఓపెన్​ ఉంటాయి.  మరి రాత్రివేళ తిరిగే జనాలకు ఫుడ్​ ఎలా అన్న దానికి మాత్రం ఒక్కటంటే ఒక్క ప్లేస్​ బెటర్​ చాయిస్​గా నిలస్తోంది. సరదాగా బయటకెళ్లి ఫుడ్​ తింటూ వెదర్​ని ఎంజాయ్​ చేయాలనుకునే వారికి ఇదే బెస్ట్​ ప్లేస్​. అది 24/7 ఓపెన్​లో ఉండడం కూడా ఇక్కడ ప్లస్​ పాయింట్​గా చెప్పుకోవచ్చు.  ఆ హోటల్​ పేరు కూడా ‘‘రోస్ట్​ 24/7’’..

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

హైదరాబాద్ పేరు వింటే చాలు చాలామంది ఫుడ్​ లవర్స్​ ఇష్టపడుతుంటారు. ఇక్కడ ఇరానీ చాయ్​ నుంచి హైదరాబాద్​ బిర్యానీ దాకా అన్ని చాలా డిఫరెంట్​ అనే చెప్పాలి. అంతేకాకుండా.. ఇండియన్​ నుంచి ఇటాలియన్ ఫుడ్​ దాకా అనేక రకాల ఆహారాలు లభిస్తాయి. అయితే.. ఈ ఫుడీస్ స్వర్గంలో రాత్రివేళ12 గంటలకు షట్టర్‌లను క్లోజ్​ చేసేయడమే ఇక్కడ బాధాకరం. ఇక.. ఆ తర్వాత రేడియో నిశ్శబ్దంతో పాటు, చాలా మటుకు ఖాళీ రోడ్లే కనిపిస్తాయి. సాధారణంగా మిడ్​నైట్​ ఆకలివేస్తే ఏం చేస్తారు? స్విగ్గీ లేదా జొమాటో యాప్​లతో ఆర్డర్ చేయడం అనేది ఇప్పుడు చాలా మంది చేసే పని. కానీ, సిటీలోనే 24/7 రోస్ట్ అనే హోటల్​ మాత్రం నిరంతరం తెరిచే ఉంటుంది. ఫుడీస్​కి కావాల్సిన ఆహార పదార్థాలను అందిస్తుంది.

హైదరాబాదులోని IT హబ్ అయిన హైటెక్ సిటీలో ఉన్న ఒక కేఫ్ ఇది. ఈ హోటల్​ ఎప్పుడూ క్లోజ్​ అవదు. ఉదయం 6 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల దాకా ఓపెన్​ అయ్యే ఉంటుంది. ఇప్పుడు రోస్ట్ 24 సెవెన్ అనేది ఫుడ్డీస్​కి అడ్డాగా మారిందనే చెప్పవచ్చు. వారి ఇన్‌స్టాగ్రామ్ పేజీ పరిశీలిస్తే.. చెప్పబోయేది ఏమిటో ఇట్టే కనిపెట్టేస్తారు. రోస్ట్ 24 సెవెన్ డిఫరెంట్​ స్టైల్స్​లో కాఫీని అందిస్తోంది. ఇందులో అన్ని రకాల లాట్టే, మొచాక్సినో, ఫ్రెంచ్ ప్రెస్, కాపి రాయల్ వంటివి ఉన్నాయి. కాఫీ -ప్రియులు తమ సమయాన్ని ఎంజాయ్​ చేయడానికి ఇది మంచి ప్లేస్​ అనే చెప్పవచ్చు.

ఇక.. కాఫీ అంటే పెద్దగా ఇష్టపడని వారు, చాయ్‌ కావాలనుకునే వారికి కూడా ఎట్లాంటి డౌట్​ పడాల్సిన పనిలేదు. రోస్ట్ 24 సెవెన్ వారి మసాలా చాయ్, చమోమిలే గ్రీన్ టీ, కాశ్మీరీ కవా, బెర్రీ బ్లాస్ట్, డార్జిలింగ్ బ్లాక్‌తో చాయ్​ ప్రియులను కూడా ఆనందింపజేస్తుంది. కాగా, ఫుడ్​ మెనులో ఏం ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా? అక్కడ సలాడ్‌లు, రకరకాల పాస్తా, బర్గర్‌లు, థిన్-క్రస్ట్ పిజ్జాలు, శాండ్‌విచ్‌లు, సూప్‌లు, అపెటిజర్‌లను కలిగి ఉన్న అతిపెద్ద మెను అందుబాటులో ఉంటుంది. ‘దిల్ సే దేశీ’ అయిన ఫుడీస్ కూడా తమ భారతీయ మెయిన్ కోర్స్ ని ఆర్డర్ చేసే చాన్స్​ ఉంది. వారికి ఎంతో టేస్టీగా కూడా అందించేలా ఏర్పాట్లు చేశారు.  

- Advertisement -

సరే.. ఇండియన్ లేదా ఇటాలియన్ మూడ్‌లో లేరు అనుకుందాం.. అప్పుడు ఏం తినాలనే కదా మీ ఆలోచన.. అదీ వద్దంటున్నారు ఈ హోటల్​ నిర్వాహకులు. మధ్యధరా రుచిని దృష్టిలో ఉంచుకుని బాబా గనౌష్, ఫలాఫెల్, హమ్మస్, పిటా బ్రెడ్ వంటి వస్తువులతో క్యూరేట్ చేయబడిన రోస్ట్ 24 సెవెన్ ‘మెజ్జ్ ప్లాటర్’ని ఆర్డర్ చేయవచ్చు. లిప్-స్మాకింగ్ ఫుడ్ కాకుండా.. రోస్ట్ 24 సెవెన్ లేత గోధుమరంగు, క్రీమ్ మూలకాలతో.. ఆకుపచ్చ, గులాబీ రంగులతో నిండిన సొగసైన.. క్లాసీ వాతావరణాన్ని అందిస్తుంది. ఆ నిర్మలమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూనే.. అక్కడి గోడలకు ఉన్న ఫొటోలను.. ఆ పక్కనే ఉన్న పచ్చని మొక్కలు, పాప్ సంస్కృతి మైమరిపింప జేస్తాయి. ఇక.. ఓవర్ హెడ్ లైటింగ్ కూడా కేఫ్‌ని ఓ డిఫరెంట్​ లొకేషన్​లో ఉన్నట్టు భావింపజేస్తుంది. హైదరాబాద్‌లోని అద్భుతమైన వాతావరణంలో ఫ్రెండ్స్​తో కలసి ఎంజాయ్​ చేసేందుకు ఇది బెస్ట్​ ప్లేస్​గా నిలుస్తోంది. మీరు కనుక ఇప్పటికే రోస్ట్ 24 సెవెన్‌కి వెళ్లి ఉన్నట్టయితే మీ ఎక్స్​పీరియన్స్​, ఫీలింగ్స్​ని కామెంట్స్​ రూపంలో ఇవ్వడం మాత్రం మరిచిపోవద్దు.

Advertisement

తాజా వార్తలు

Advertisement