చిటపట చినుకులు.. కూల్ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నారు హైదరాబాద్ సిటీ జనం. వీకెండ్స్‌లో ఎంచక్కా బయటికి వెళ్లి ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం రాత్రి 11 నుంచి 12 గంటల వరకే స్టాల్స్, హోటల్స్ ఓపెన్ ఉంటాయి. మరి రాత్రివేళ తిరిగే జనాలకు ఫుడ్ ఎలా అన్న దానికి మాత్రం ఒక్కటంటే ఒక్క ప్లేస్ బెటర్ చాయిస్‌గా నిలస్తోంది. సరదాగా బయటకెళ్లి ఫుడ్ తింటూ వెదర్ని ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇదే బెస్ట్ ప్లేస్. అది 24/7 ఓపెన్‌లో ఉండడం కూడా ఇక్కడ ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఆ హోటల్ పేరు కూడా ‘‘రోస్ట్ 24/7’’..
– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
హైదరాబాద్ పేరు వింటే చాలు చాలామంది ఫుడ్ లవర్స్ ఇష్టపడుతుంటారు. ఇక్కడ ఇరానీ చాయ్ నుంచి హైదరాబాద్ బిర్యానీ దాకా అన్ని చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. అంతేకాకుండా.. ఇండియన్ నుంచి ఇటాలియన్ ఫుడ్ దాకా అనేక రకాల ఆహారాలు లభిస్తాయి. అయితే.. ఈ ఫుడీస్ స్వర్గంలో రాత్రివేళ12 గంటలకు షట్టర్‌లను క్లోజ్ చేసేయడమే ఇక్కడ బాధాకరం. ఇక.. ఆ తర్వాత రేడియో నిశ్శబ్దంతో పాటు, చాలా మటుకు ఖాళీ రోడ్లే కనిపిస్తాయి. సాధారణంగా మిడ్నైట్ ఆకలివేస్తే ఏం చేస్తారు? స్విగ్గీ లేదా జొమాటో యాప్‌లతో ఆర్డర్ చేయడం అనేది ఇప్పుడు చాలా మంది చేసే పని. కానీ, సిటీలోనే 24/7 రోస్ట్ అనే హోటల్ మాత్రం నిరంతరం తెరిచే ఉంటుంది. ఫుడీస్‌కి కావాల్సిన ఆహార పదార్థాలను అందిస్తుంది.
హైదరాబాదులోని IT హబ్ అయిన హైటెక్ సిటీలో ఉన్న ఒక కేఫ్ ఇది. ఈ హోటల్ ఎప్పుడూ క్లోజ్ అవదు. ఉదయం 6 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల దాకా ఓపెన్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు రోస్ట్ 24 సెవెన్ అనేది ఫుడ్డీస్కి అడ్డాగా మారిందనే చెప్పవచ్చు. వారి ఇన్‌స్టాగ్రామ్ పేజీ పరిశీలిస్తే.. చెప్పబోయేది ఏమిటో ఇట్టే కనిపెట్టేస్తారు. రోస్ట్ 24 సెవెన్ డిఫరెంట్ స్టైల్స్‌లో కాఫీని అందిస్తోంది. ఇందులో అన్ని రకాల లాట్టే, మొచాక్సినో, ఫ్రెంచ్ ప్రెస్, కాపి రాయల్ వంటివి ఉన్నాయి. కాఫీ -ప్రియులు తమ సమయాన్ని ఎంజాయ్ చేయడానికి ఇది మంచి ప్లేస్ అనే చెప్పవచ్చు.
ఇక.. కాఫీ అంటే పెద్దగా ఇష్టపడని వారు, చాయ్ కావాలనుకునే వారికి కూడా ఎట్లాంటి డౌట్ పడాల్సిన పనిలేదు. రోస్ట్ 24 సెవెన్ వారి మసాలా చాయ్, చమోమిలే గ్రీన్ టీ, కాశ్మీరీ కవా, బెర్రీ బ్లాస్ట్, డార్జిలింగ్ బ్లాక్‌తో చాయ్ ప్రియులను కూడా ఆనందింపజేస్తుంది. కాగా, ఫుడ్ మెనులో ఏం ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా? అక్కడ సలాడ్‌లు, రకరకాల పాస్తా, బర్గర్‌లు, థిన్-క్రస్ట్ పిజ్జాలు, శాండ్‌విచ్‌లు, సూప్‌లు, అపెటిజర్‌లను కలిగి ఉన్న అతిపెద్ద మెను అందుబాటులో ఉంటుంది. ‘దిల్ సే దేశీ’ అయిన ఫుడీస్ కూడా తమ భారతీయ మెయిన్ కోర్స్ ని ఆర్డర్ చేసే చాన్స్ ఉంది. వారికి ఎంతో టేస్టీగా కూడా అందించేలా ఏర్పాట్లు చేశారు.
సరే.. ఇండియన్ లేదా ఇటాలియన్ మూడ్‌లో లేరు అనుకుందాం.. అప్పుడు ఏం తినాలనే కదా మీ ఆలోచన.. అదీ వద్దంటున్నారు ఈ హోటల్ నిర్వాహకులు. మధ్యధరా రుచిని దృష్టిలో ఉంచుకుని బాబా గనౌష్, ఫలాఫెల్, హమ్మస్, పిటా బ్రెడ్ వంటి వస్తువులతో క్యూరేట్ చేయబడిన రోస్ట్ 24 సెవెన్ ‘మెజ్జ్ ప్లాటర్’ని ఆర్డర్ చేయవచ్చు. లిప్-స్మాకింగ్ ఫుడ్ కాకుండా.. రోస్ట్ 24 సెవెన్ లేత గోధుమరంగు, క్రీమ్ మూలకాలతో.. ఆకుపచ్చ, గులాబీ రంగులతో నిండిన సొగసైన.. క్లాసీ వాతావరణాన్ని అందిస్తుంది. ఆ నిర్మలమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూనే.. అక్కడి గోడలకు ఉన్న ఫొటోలను.. ఆ పక్కనే ఉన్న పచ్చని మొక్కలు, పాప్ సంస్కృతి మైమరిపింప జేస్తాయి. ఇక.. ఓవర్ హెడ్ లైటింగ్ కూడా కేఫ్‌ని ఓ డిఫరెంట్ లొకేషన్లో ఉన్నట్టు భావింపజేస్తుంది. హైదరాబాద్‌లోని అద్భుతమైన వాతావరణంలో ఫ్రెండ్స్‌తో కలసి ఎంజాయ్ చేసేందుకు ఇది బెస్ట్ ప్లేస్‌గా నిలుస్తోంది. మీరు కనుక ఇప్పటికే రోస్ట్ 24 సెవెన్‌కి వెళ్లి ఉన్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్, ఫీలింగ్స్‌ని కామెంట్స్ రూపంలో ఇవ్వడం మాత్రం మరిచిపోవద్దు.