నేటి బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 270 మేర పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం రేటు రూ. 51,820కు చేరింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు అయితే రూ. 250 పెరిగింది. దీంతో ఈ పసిడి రేటు 10 గ్రాములకు రూ. 47,500కు చేరింది. బంగారం రేటు నిన్న కూడా పైకి చేరింది. రూ. 320 మేర దూసుకుపోయింది. ఇక వెండి రేటు విషయానికి వస్తే.. సిల్వర్ రేటు కేజీకి రూ. 61,100కు చేరింది. ఈ రోజు వెండి ధర రూ. 200 మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేటును గమనిస్తే.. వెలవెలబోయింది. బంగారం ధర తగ్గింది. గోల్డ్ రేటు ఔన్స్‌కు 0.21 శాతం మేర దిగి వచ్చింది. దీంతో బంగారం రేటు ఔన్స్‌కు 1767 డాలర్ల వద్ద కదలాడుతోంది. అలాగే వెండి రేటు కూడా ఇంతే. సిల్వర్ ధర కూడా క్షీణించింది. 0.10 శాతం మేర తగ్గింది. దీంతో వెండి ధర ఔన్స్‌కు 19.09 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్లో రేట్లు తగ్గినా కూడా దేశీ మార్కెట్లో పసిడి రేటు పైకి చేరడం గమనార్హం.
Advertisement
తాజా వార్తలు
Advertisement