రేపు టిఆర్ ఎస్ పార్టీ ప్లీనరీ జరగనుంది. హైదరాబాద్ మాదాపూర్ లోని హెచ్ ఐసీసీలో పార్టీ ప్రతినిధులతో ఈ ప్లీనరి జరగనుంది. కాగా ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు నగరానికి రానుండటంతో నగరం నలువైపులా స్వాగత తోరణాలు, ప్రధాన కూడళ్లలో పార్టీ జెండాలు, అధినేతల ఫొటోలతో అలంకరించారు.ప్లీనరీకి హాజరయ్యే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ప్లీనరీలోని వంటల ప్రాంగణం రుచికరమైన వంటకాలతో ఘుమఘుమలాడుతోంది. కడుపు నిండా భోజనం వడ్డించేందుకు వంటకాలను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 33 రకాల వెరైటీలను ఏర్పాటు చేశారు. డబుల్‌కామీట, గులాబ్‌జామ్, మిర్చిబజ్జీ, రుమాలీ రోటీ, తెలంగాణ నాటు కోడి కూర, చికెన్‌ధమ్ బిర్యానీ, ధమ్‌కా చికెన్, మిర్చి గసాలు, ఆనియన్ రైతా, మటన్‌కర్రీ, తలకాయ కూర, బోటీదాల్చా, కోడిగుడ్డు పులుసు, బగారా రైస్, మిక్స్‌డ్ వెజ్ కుర్మా ..వైట్ రైస్, మామిడికాయ పప్పు, దొండకాయ, కాజుఫ్రై, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, ములక్కాడ, కాజు, టమాట కర్రీ.. వెల్లిపాయ కారం, టమాట, కొత్తిమీర తొక్కు, మామిడికాయ తొక్కు, పప్పుచారు అప్పడం, పచ్చిపులుసు, ఉలువ చారు క్రీమ్,టమాట రసం, పెరుగు, బటర్‌స్కాచ్ ఐస్‌క్రీమ్, ఫ్రూట్స్ స్టాల్, అంబలి, బటర్ మిల్క్.
టీఆర్ ఎస్ పార్టీ ప్లీనరీకి ముస్తాబవుతోన్న హైదరాబాద్ – 33రకాల వెరైటీ వంటకాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement