Monday, November 25, 2024

Hyderabad: బంజారాహిల్స్​ స్కూల్​ బాలికలపై అఘాయిత్యం.. ప్రిన్సిపల్​, కారు డ్రైవర్​పై కేసు నమోదు

నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపుల ఘటనలో.. హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని DAV స్కూల్ ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యం (డ్రైవర్‌ను తరగతి గదుల్లోకి అనుమతించడం)పై నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైవేట్​ స్కూల్​ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటనపై కూడా పోలీసులు సీరియస్​ యాక్షన్​ తీసుకున్నారు. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 364, 376 (ఎ) (బి), పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇక.. నిందితుడు రజనీ కుమార్ బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను పాఠశాలలోని డిజిటల్ క్లాస్‌రూమ్‌లోకి తరచూ వెళ్లేవాడని, విద్యార్థినులను అనుచితంగా తాకేవాడని తెలుస్తోంది. వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడని పిల్లల తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే.. రెండు నెలలుగా అదే పాఠశాలలో చదివే నాలుగేండ్ల బాలిక ఇంట్లో అన్కమనస్కంగా ఉండడం, తరచూ ఏడుస్తూ స్కూల్​కి వెళ్లనని మారాం చేయడంతో తల్లిదండ్రులు ఆరాతీశారు. దీంతో ఆ బాలిక స్కూల్లో జరిగిన విషయాలను తల్లిదండ్రులకు వివరించింది.

రజనీ కుమార్‌ లైంగిక వేధింపుల గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు, బాలిక బంధువులు కలిసి నిన్న DAV పాఠశాలకు వెళ్లి డ్రైవర్​ని చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు పాఠశాలకు చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ప్రస్తుతం నిఘా కెమెరాల ద్వారా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అదే రోజు రాత్రి నిందితులపై చర్యలు తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు స్టేషన్‌కు వచ్చారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే నిరసన తెలిపారు. ‘మాకు న్యాయం కావాలి’ అంటూ నినాదాలు చేశారు.

- Advertisement -

DAV పాఠశాలలో చదివే ఒక విద్యార్థి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. “అక్కడ ఏం జరుగుతుందో ప్రిన్సిపాల్‌కి తెలిసి ఉండాలి. మరికొందరు పిల్లలు కూడా విపరీతంగా బాధపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై యాజమాన్యం మౌనం వహించింది. అందుకే వారిపైన కూడా కేసు నమోదు చేయాలి”అని డిమాండ్​ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement